Bus Accident In Uttarakhand : ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.
సోమవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో బస్సు గర్వాల్ నుంచి రాంనగర్‌కు వెళ్తుండగా అల్మోరాలోని కూపి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే 28 మంది మరణించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Uttarakhand: A Garwal Motors Users' bus fell into a gorge near Kupi in Ramnagar at Pauri-Almora border. Deaths and injuries feared. Search and rescue operation underway. Details awaited.
— ANI (@ANI) November 4, 2024
(Video: SDRF) pic.twitter.com/dzSgKw6tkF
స్పందించిన ప్రధాని, సీఎం
ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ప్రధానమంత్రి సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the mishap in Almora, Uttarakhand. The injured would be given Rs. 50,000. https://t.co/KAjq9Agj8i
— PMO India (@PMOIndia) November 4, 2024
మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని వాయుమార్గంలో తరలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బస్సు ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనతో సంబంధం ఉన్న వారిని సస్పెండ్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Uttarakhand CM Pushkar Singh Dhami posts, " very sad news has been received about the casualties in the bus accident that took place in marchula of almora district. the district administration has been instructed to conduct relief and rescue operations swiftly. the local… https://t.co/198fEV3xMw pic.twitter.com/wIZ969yqqd
— ANI (@ANI) November 4, 2024