Man Killed Grandmother For Insurance : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో కోటీశ్వరుడు కావాలనే తపనతో ఓ యువకుడు తన అమ్మమ్మ చనిపోయేలా చేశాడు. ముందుగానే ఆమెకు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, బాధితురాలు మృతి చెందిన తర్వాత ఆ సొమ్మును అందుకున్నాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అసలే జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- బాందే పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన మృతురాలు రాణి పఠారియా భర్త కొన్ని నెలల క్రితం మరణించాడు. దీంతో రాణి తన కుమార్తె ఇంటికి వచ్చేసింది. అయితే మృతురాలి మనవడు ఆకాశ్ కోటీశ్వరుడు కావాలని కుట్ర పన్నాడు. తన అమ్మమ్మను హత్య చేయించాలని ప్లాన్ వేశాడు. అంతకుముందు ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్వారా తన అమ్మమ్మ పేరు మీద రూ.కోటి బీమా పాలసీ చేయించాడు.
రూ.30వేలు సుపారీ ఇచ్చి!
అయితే పాము కాటుతో బాధితురాలు చనిపోతే బీమా సొమ్ము రూ.కోటి అందుతుందని ఆకాశ్‌కు ఏజెంట్ చెప్పాడు. దీంతో బాధితురాలికి పాము కాటు వేయించేందుకు ఆకాశ్ పథకం వేశాడు. ఓ వ్యక్తికి రూ.30వేలు సుపారీ ఇచ్చాడు. ఏదో అబద్దం చెప్పి తన అమ్మమ్మను ఓ ప్రదేశానికి తీసుకెళ్లాడు ఆకాశ్. ఆ సమయంలో సుపారీ ఇచ్చిన వ్యక్తి ద్వారా పాముతో కాటు వేయించాడు. దీంతో ఆ మహిళ చనిపోయింది. పాము కాటు వేయడం వల్లే బాధితురాలు చనిపోయిందని అందరినీ నమ్మించాడు ఆకాశ్.
అలా దొరికిపోయాడు!
వృద్ధురాలు మరణించిన కొద్దిరోజులకే బీమా ఏజెంట్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేశాడు. ఆ తర్వాత ఆకాశ్ రూ.కోటిపైగా బీమా సొమ్మును అందుకున్నాడు. అయితే రాణి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అప్పటికే ప్రారంభించారు. ఇటీవలే మరోసారి బాధితురాలి కుటుంబసభ్యులను విచారించారు. ఆ సమయంలో ఆకాశ్ పదేపదే మాటలు మార్చాడు. దీంతో అనుమానం పెంచుకున్న పోలీసులు ఆరా తీశారు. దీంతో విచారణలో నిజం ఒప్పుకున్నాడు ఆకాశ్. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు- నిందితుల నుంచి రూ.10 లక్షల నగదు, మృతురాలి నగలు స్వాధీనం చేసుకున్నారు.
భార్యపై అనుమానం- నోట్లో కరెంట్ వైర్ పెట్టి హత్య చేసిన భర్
తమద్యం మత్తులో పక్కింటి బాలుడి హత్య- పొలంలో మృతదేహం వేసి పరార్- పీక్కు తిన్న జంతువులు