Mamata Banerjee Injured : బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు శనివారం మధ్యాహ్నం పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపుర్ నుంచి మమతా అసన్‌సోల్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డారు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే సాయం చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయమైందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు. అసన్‌సోల్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి అలనాటి నటుడు, ఎంపీ శతృఘన్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం చేపట్టారు.
ఇదిలా ఉండగా, గత నెల మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ నివాసంలో ప్రమాదవశాత్తు గది నుంచి బయటకు వస్తున్న సమయంలో కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆమె నుదిటిపై, ముక్కుపై తీవ్ర గాయమైంది. దీంతో భద్రతా సిబ్బంది ఆమెను వెంటనే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఆమెను ట్రామా కేర్ సెంటర్‌కు తరలించారు. ఇక్కడ దీదీకి అవసరమైన అన్ని పరీక్షలు చేశారు డాక్టర్లు. ట్రీట్మెంట్ తర్వాత తన నివాసానికి తీసుకెళ్లారు. అనంతరం మమత నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోను పార్టీ విడుదల చేసింది. ఆ తర్వాత తలకు కట్టుతోనే ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక, 2023 జూన్‌లోనూ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయాలతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా మమత ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బైకుంఠ్పుర్ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షంలో చిక్కుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ మొత్తం ఊగిపోయింది. ఈ క్రమంలో మమత నడుముకు, కాళ్లకు గాయాలయ్యాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ముప్పు తప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రి వైద్యులు మమతకు చికిత్స చేశారు. ఈ ప్రమాదంలో ఆమె మోకాలు, తుంటి లిగ్‌మెంట్లకు గాయాలయ్యాయి.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ఆరేళ్ల బాలుడు- దుబాయ్ నుంచి జర్నీ ఇలా! - Mount Everest Base Camp Trekking