ETV Bharat / bharat

బంగాల్ సీఎం మమతకు తీవ్ర గాయం- ఆస్పత్రిలో చికిత్స- ఇంట్లో పడిపోవడం వల్లే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 8:34 PM IST

Updated : Mar 15, 2024, 7:12 AM IST

Mamata Banerjee Injured : తృణమూల్ కాంగ్రెస్​ అధినేత్రి​ మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. కోల్​కతా ఆస్పత్రిలో చికిత్స పొందారు దీదీ.

Mamata Banerjee Injured
Mamata Banerjee Injured

Mamata Banerjee Injured : బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటి గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)​ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కాళీఘాట్​లోని తన నివాసంలోనే​ మమత గాయపడినట్లు తెలుస్తోంది.

తన గదిలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మమతా బెనర్జీ కిందపడి గాయపడ్డట్లు ఎస్​ఎస్​కేఎమ్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బంధోపాధ్యాయ తెలిపారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. 'ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రికి నుదుటిపై, ముక్కుమీద పదునైన కోత పడింది. దాని వల్ల రక్తస్రావం అయింది. మా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని అంచనా వేసి ఆమె నుదిటిపై మూడు, ముక్కు మీద ఒక కుట్లు పడ్డాయి. ఆ తర్వాత పట్టీ కట్టి, అవసరమైన ఈసీజీ, సీటీ వంటి పరీక్షలు చేశాము. అయితే ఆస్పత్రిలో ఉండడానికి మమతా నిరాకరించారు. దీంతో ఆమెను డిశ్చార్జ్​ చేశాము. అయినా ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తాం. వైద్య బృందం సూచనలకు అనుగుణంగా చికిత్స అందిస్తాం.' అని డాక్టర్​ బంధోపాధ్యాయ వివరించారు.

మోదీ స్పందన
మరోవైపు ముఖ్యమంత్రి మమతా త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్​లో ట్వీట్​ చేశారు ప్రధాని మోదీ. ఉపరాష్ట్రపతి జగ్​దీప్‌ ధన్‌ఖడ్ కూడా దీదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మమతా త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్​ వేదికగా పోస్టులు పెట్టారు. వీరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​, ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ఉన్నారు. వీలైనంత త్వరగా దీదీ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బంగాల్​ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక దీదీని పరామర్శించేందుకు కోల్​కతా నగర మేయర్​ ఫిరాద్​ హకీం సహా ఇతర పార్టీ నేతలు ఆస్పత్రికి వెళ్లారు.

ఈ ఏడాది జనవరిలోనూ
జనవరిలోనూ ఓ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్‌ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడం వల్ల దాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం విండ్‌షీల్డ్‌కు ఢీకొనడం వల్ల తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు.

తప్పిన పెను ప్రమాదం
అంతకుముందు గతేడాది జులైలో కూడా మమతా బెనర్జీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర కుదుపులకు లోనుకాగా మమత నడుముకు, కాళ్లకు గాయాలయ్యాయి. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్​ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. పెను ముప్పు తప్పడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోల్​కతాలోని ఓ ఆస్పత్రి వైద్యులు మమతకు చికిత్స చేశారు. ఈ వార్త పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

MSPకి చట్టబద్ధత, శాశ్వత రుణమాఫీ కమిషన్- కాంగ్రెస్‌ 'కిసాన్‌ న్యాయ్‌' 5 గ్యారంటీలు

అయోధ్య రామయ్యకు కానుకగా 1100కిలోల తబలా- వాయిస్తే కొన్ని కి.మీ వరకూ శబ్ధమే!

Last Updated : Mar 15, 2024, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.