ETV Bharat / bharat

ఈడీ విచారణకు లాలూ- ఎన్​డీఏ సర్కార్ ఏర్పాటైన మరుసటి రోజే - Bihar Political Crisis

Lalu Prasad Yadav ED : బిహార్​లో ఎన్​డీఏ సర్కార్​ కొలువుదీరిన మరుసటి రోజే ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఈడీ విచారణకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హాజరవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పట్నాలోని ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె మిసా భారతితో కలిసి​ హాజరయ్యారు.

Lalu Prasad Yadav Ed
Lalu Prasad Yadav Ed
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 12:11 PM IST

Updated : Jan 29, 2024, 1:19 PM IST

Lalu Prasad Yadav ED : బిహార్​లో ఎన్​డీఏ సర్కార్​ కొలువుదీరిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం జరిగింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఈడీ విచారణకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. పట్నాలోని ఈడీ కార్యాలయానికి లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె మిసా భారతితో కలిసి వచ్చారు. ఆ సమయంలో ఈడీ కార్యాలయానికి ఆర్జేడీ కార్యకర్తలు, లాలూ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లాలూకు అనుకూలంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

  • #WATCH | Bihar: RJD President Lalu Prasad Yadav arrives at the ED office in Patna. A large number of RJD workers are present here and are protesting against the central govt.

    He is appearing before the ED in connection with the Land for Job scam case pic.twitter.com/lRbWBjVohk

    — ANI (@ANI) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లాలూ ప్రసాద్ యాదవ్ విచారణ నిమిత్తం ఈడీ ఎదుట హాజరుకావడంపై ఆయన కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడారు. 'ఇది కొత్త విషయం కాదు. తమతో(బీజేపీని ఉద్దేశించి) రాని వారికి ఈ శుభాకాంక్షల కార్డు పంపుతోంది. ఏదైనా ఏజెన్సీ మా కుటుంబాన్ని పిలిచినప్పుడల్లా మేము అక్కడికి వెళ్లి వారికి సహకరిస్తాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తాం." అని తెలిపారు.

  • #WATCH | Patna, Bihar: On RJD President Lalu Prasad Yadav appearing before the ED, RJD MP and daughter of Lalu Prasad Yadav Dr Misa Bharti says, "This is not a new thing. This greeting card is being sent to those who are not coming with them. Whenever any agency calls our family,… https://t.co/L6sqzHf71J pic.twitter.com/rPDJxksygu

కేసు ఏంటంటే?
Land For Job Scam Bihar : భూములు తీసుకుని బదులుగా రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మనీ లాండరింగ్‌ కేసులో ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ పట్నా కార్యాలయంలో ఈడీ విచారణకు సోమవారం హాజరయ్యారు.

బిహార్​లో ఎన్​డీఏ సర్కార్​
Bihar Political Crisis : అనేక నాటకీయ పరిణామాల మధ్య బిహార్​లో ఆదివారం ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పడింది. బిహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నీతీశ్​తోపాటు బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాను డిప్యూటీ సీఎంలుగా బిహార్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్​ ప్రమాణం చేయించారు. మరో ఎనిమిది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో జరిగిన నీతీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు హాజరయ్యారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్​జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నీతీశ్ కుమార్.

బిహార్ అసెంబ్లీ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్

'ఇదీ మూన్నాళ్ల ముచ్చటే-ఎన్నికల వరకు కూడా కష్టమే!' బిహార్ పాలిటిక్స్​పై పీకే సంచలన వ్యాఖ్యలు

Last Updated : Jan 29, 2024, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.