ETV Bharat / bharat

కోల్​కతా డాక్టర్ కేసులో కీలకంగా DNA రిపోర్ట్ - హత్యాచారానికి ముందు రోజు ఆస్పత్రిలోనే నిందితుడు! - Kolkata Doctor Murder Case - KOLKATA DOCTOR MURDER CASE

Kolkata Doctor Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న బంగాల్‌లోని జూనియర్‌ డాక్టర్ హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటనకు ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలోనే ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదయ్యాయి. మరోవైపు వైద్యురాలిపై సామూహిక హత్యాచారం జరిగిందనే ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్ఏ రిపోర్ట్ కీలకం కానుంది.

Kolkata Doctor Murder Case
Kolkata Doctor Murder Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 4:01 PM IST

Kolkata Doctor Murder Case : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హత్యాచారం ముందు రోజు నిందితుడు ఆస్పత్రిలో స్వేచ్ఛగా తిరుగుతూ బాధిత వైద్యురాలిని గమనించిన దృశ్యాలు సీసీటీవీలో బయటపడ్డాయి. ఈ కేసులో సామూహిక హత్యాచారం జరిగిందని ఆరోపణలు వస్తున్న వేళ డీఎన్​ఏ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. అయితే వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. డీఎన్​ఏ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఆ రోజు ఆస్పత్రిలో నిందితుడు
నిందితుడు సంజయ్‌ రాయ్‌ ఘటనకు ముందు రోజు (ఆగస్టు 8న) ఆస్పత్రిలో ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం. నేరానికి ఒకరోజు ముందు నిందితుడు రాయ్‌ ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని చెస్ట్‌ మెడిసన్‌ వార్డ్‌లో ఉన్నట్లు ఒప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆగస్టు 8న ఉదయం 11 సమయంలో నిందితుడు వార్డ్‌లో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీ కూడా ధృవీకరిస్తుందని వెల్లడించాయి. ఆ సమయంలో అదే వార్డులో బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ వైద్యులు ఉన్నారని తెలిపాయి. వారిని నిందితుడు గమనిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైందని చెప్పాయి. ఆ నలుగురు జూనియర్‌ వైద్యుల వాంగ్మూలాన్ని కూడా సీబీఐ రికార్డు చేసినట్లు సమాచారం.

పశ్చాత్తాపం కనిపించడం లేదు
ఘటన జరిగిన రోజు ఆగస్టు 9న తెల్లవారుజామున ఒంటిగంటకు బాధితురాలు ఆస్పత్రిలోని సెమినార్‌ హాల్‌లోకి వెళ్లినట్లు ఆధారాలు చెబుతున్నాయి. అక్కడ మరో జూనియర్‌ డాక్టర్‌తో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. అనంతరం నిద్రపోయేందుకు వెళ్లినట్లు సమాచారం. నిందితుడు రాయ్‌ 4 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలిసింది. ఆ సమయంలోనే నేరం జరిగి ఉండొచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. విచారణలో సమయంలో దారుణానికి ఒడిగట్టిన నిందుతుడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని అధికారులు తెలిపారు. గతంలోనూ మహిళలతో నిందితుడు అనుచితంగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు. మూడు నెలల గర్భిణి అయిన తన భార్యను కొట్టడం వల్ల గర్భస్రావం జరిగిందని నిందితుడి మాజీ అత్త తెలిపింది. రాయ్‌ను ఊరి తీయాలని ఆమె డిమాండ్‌ చేసింది.

వైద్యురాలిపై గ్యాంగ్ రేప్​ జరిగిందా?
మరోవైపు జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ దుర్ఘటనలో డీఎన్ఏ నివేదిక ఇప్పుడు ప్రధానంగా మారింది. డీఎన్​ఏ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత ఎంతమంది ప్రమేయం ఉందో తేలుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నమూనాలను సీబీఐకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(CFSL) ల్యాబ్‌లో పరీక్షలు చేస్తోంది. త్వరలోనే నివేదిక అందుబాటులోకి రానుంది. బాధితురాలిపై సామూహిక హత్యాచారం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న కథనాలను ఇప్పటికే కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.

'వైద్యురాలి హత్యాచారంపై FIR నమోదుకు ఎందుకంత ఆలస్యం?'- బంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్ - Supreme Court on Doctor Murder Case

RG కర్​ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్​ మెడపై కత్తి! సిట్​ ఏర్పాటు చేసిన దీదీ ప్రభుత్వం - Bengal Doctor Murder Case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.