ETV Bharat / bharat

హిమాచల్​లో 'కింగ్' vs 'క్వీన్'- రాయల్​ ఫ్యామిలీ కంచుకోటపై కంగనా రనౌత్ కన్ను​- మండిలో జెండా పాతేనా? - King Vs Queen In Mandi Lok Sabha - KING VS QUEEN IN MANDI LOK SABHA

King Vs Queen In Mandi Lok Sabha Seat : సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్​ప్రదేశ్​లోని మండి లోక్ సభ స్థానం నుంచి బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు జరగనుంది. రాజవంశీయుడైన విక్రమాదిత్య కంగనాపై పోటీ చేయడం వల్ల మండిలో కింగ్ వర్సెస్ క్వీన్ మధ్య పోటీ నెలకొందని అంటున్నారు విశ్లేషకులు.

King Vs Queen In Mandi Lok Sabha Seat
King Vs Queen In Mandi Lok Sabha Seat
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 12:40 PM IST

King Vs Queen In Mandi Lok Sabha Seat : హిమాచల్​ప్రదేశ్​ మండి లోక్ సభ స్థానంలో ఆసక్తికర పోరు జరగనుంది. 'కింగ్' వర్సెస్ 'రీల్ క్వీన్' తలపడుతున్నారు. బీజేపీ తరఫున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉండగా, హస్తం పార్టీ నుంచి రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్‌ను బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం విక్రమాదిత్య సింగ్ హిమాచల్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, హిమాచల్‌ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌ దంపతుల తనయుడైన విక్రమాదిత్య ఇప్పటికే రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి మండిలో యువనేతనే రంగంలో దించాలని సీనియర్‌ నేతలు భావించడం వల్ల ఆయన పేరు ఖరారైంది.

ఇప్పటి వరకు రాజకటుంబాలదే హవా
ఇప్పటివరకు మండి నియోజకవర్గంలో రాజకుటుంబాలదే హవా. 1952 నుంచి రెండు ఉపఎన్నికలు సహా మొత్తం 19 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 13సార్లు రాజకుటుంబాలకు చెందినవారే గెలుపొందారు. సిమ్లా రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విక్రమాదిత్య సింగ్​కు మండి పార్లమెంటరీ నియోజకవర్గం కొత్తేమీ కాదు. విక్రమాదిత్య సింగ్ తండ్రి వీరభద్రసింగ్, ప్రతిభాసింగ్ ఇదే నియోజకవర్గంలో ఒక్కొక్కరు మూడు సార్లు గెలుపొందారు. 2021లో మండి లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికల్లో తన తల్లి ప్రతిభా సింగ్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులతో విక్రమాదిత్యకు మంచి సంబంధాలు ఉన్నాయి.

ఒకరిపై ఒకరు విమర్శలు
తన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం ప్రకటించకముందే కంగనా రనౌత్​పై విక్రమాదిత్య సింగ్ విమర్శలు గుప్పించారు. కంగనాను వివాదాల రాణిగా అభివర్ణించారు. 'కంగనాకు బుద్ధి ప్రసాదించాలని రాముడిని ప్రార్థిస్తున్నా. హిమాచల్‌ ప్రజల గురించి ఏమాత్రం తెలియని ఆమె మళ్లీ బాలీవుడ్‌కు వెళ్తుందని ఆశిస్తున్నా' అని విమర్శించారు. విక్రమాదిత్య సింగ్​కు కౌంటర్ వేశారు కంగనా రనౌత్. 'హిమాచల్ విక్రమాదిత్య తాతల జాగీరేమీ కాదు. నన్ను బెదిరించి వెనక్కి పంపలేరు. రాహుల్‌, విక్రమాదిత్య ఇద్దరూ పప్పూలే. హిమాచల్‌లోని ఛోటా పప్పు నేను గోమాంసం తింటానని అంటున్నారు. అయితే నేను గోమాంసం తిన్నట్లు ఆధారాలు ఎందుకు చూపడం లేదు. అబద్దాలు చెప్పడంలో విక్రమాదిత్య సింగ్ నెంబరు 1గా ఉన్నారు. తల్లిదండ్రుల సాయం లేకుండానే సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నాను. రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉంది.' అని కంగానా రనౌత్ అన్నారు.

హిమాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జైరాం ఠాకూర్​కు మండిలో మంచి పట్టు ఉండడం కంగనాకు కలిసివస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేగాక మండి నియోజకవర్గ పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రెండు అంశాలు బీజేపీకి బాగా కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు.

జమిలి ఎన్నికలు, UCCకి బీజేపీ హామీ- వికసిత భారతమే 'మోదీ గ్యారంటీ'- సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టో రిలీజ్ - BJP Lok Sabha Election Manifesto

ట్రయల్​కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు- తప్పుబట్టిన సుప్రీం- సరైన కారణం లేనిదే రద్దు చేయరాదని క్లారిటీ - SC SERIOUS ON GUJARAT High Court

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.