ETV Bharat / bharat

ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశం- ప్రధాని నివాసం ముట్టడిలో ఉద్రిక్తత - Kejriwal Issue 2nd Order From Jail - KEJRIWAL ISSUE 2ND ORDER FROM JAIL

Kejriwal Issue Second Order From Jail : ఈడీ కస్టడీ నుంచి దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉత్తర్వులును జారీ చేశారు. మరోవైపు ఆయన అరెస్టును నిరసిస్తూ ఆప్‌ నేతలు ప్రధాని నివాసం ముట్టడికి పిలుపునివ్వగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..

AAP Protest At PM Modi House
AAP Protest At PM Modi House
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 10:37 AM IST

Updated : Mar 26, 2024, 12:05 PM IST

Kejriwal Issue Second Order From Jail : మద్యం పాలసీ కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జైలు నుంచి మరో ఉత్తర్వును జారీ చేశారు. ఇప్పటికే కస్టడీ నుంచి తొలిసారి ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సమయంలో తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం లాకప్‌ నుంచి కేజ్రీవాల్‌ ఆరోగ్యశాఖకు సంబంధించి రెండో ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో ఉండాలి
కేజ్రీవాల్ జారీ చేసిన ఆదేశాలను దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చదివి వినిపించారు. 'జైలులో ఉన్నప్పటికీ దిల్లీ ప్రజల ఆరోగ్యంపై కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై నాకు ఆదేశాలు జారీ చేశారు. దిల్లీలోని కొన్ని ఆస్పత్రుల్లో, మొహల్లా క్లినిక్​ల్లో ప్రజలకు ఉచిత మందులు అందుబాటులో లేవు. వాటిని అందుబాటులో ఉంచాలి. కొన్ని ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు కూడా నిర్వహించడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించాలి' అని తనని ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

ఆప్​ నేతలు అరెస్ట్
మరోవైపు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్​ నేతలు చేపట్టిన ప్రధాని మోదీ నివాసం ముట్టడిలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పంజాబ్​ మంత్రితో సహా పలువురు ఆప్​ నేతలను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు ప్రధాని మోదీ నివాసం చుట్టూ పలు అంచెల్లో పోలీసులు మోహరించారు. అటు వైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్‌ విధించారు. ఆప్ కార్యకర్తలు వచ్చే అవకాశమున్న దిల్లీలోని పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అలాగే మూడు మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేశారు. నిరసనల కారణంగా సెంట్రల్ దిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు.

సీఎం రాజీనామా చేయాలని నిరసనలు
ఇదిలా ఉండగా మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేపట్టారు. ఈ మేరకు దిల్లీలోని పటేల్​ చౌక్ మెట్రో స్టేషన్, ఫిరోజ్ షా కోట్లాలో నిరసలు చేపట్టారు. జైలులో ఉన్న కేజ్రీవాల్ రాజీనామా చేసి బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్​కు ఇప్పటికీ అత్యాశతో ఉన్నారని విమర్శించారు. మద్యం కుంభకోణం నుంచి దృష్టిని మార్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆప్​ నేతలు చెబుతున్నారని బీజేపీ నేత మంజీందర్ సింగ్​ సిర్సా అన్నారు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచి డ్రామా చేస్తున్నారని, తప్పుడు లేఖలపై చర్యులు తీసుకోవాలని ఈడీ డైరెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

లక్షల మెజారిటీతో గెలిచినా నో టికెట్- 39మంది సిట్టింగ్​ ఎంపీలకు బీజేపీ షాక్ - BJP drops sitting MPs

'కేజ్రీవాల్ అంటే మోదీకి భయం'- సోషల్​మీడియా డీపీ మార్చుకోవాలని ఆప్ మంత్రి పిలుపు - AAP DP campaign For Kejriwal

Last Updated : Mar 26, 2024, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.