Kejriwal Bail Plea Supreme Court : దిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం పరిశీలించింది. ఈ పిటిషన్‌పై విచారణను జూన్ 26వ తేదీకి(బుధవారం) వాయిదా వేసింది. ఈ సందర్భంగా కోర్టులో ఇరుపక్షాల నడుమ వాడివేడిగా వాదోపవాదనలు జరిగాయి.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ, బెయిల్ ఆర్డర్‌పై మధ్యంతర స్టేను తొలగించాలని కోరారు. ఈడీ తరపున హాజరైన ఏఎస్‌జీ ఎస్వీ రాజు, కేజ్రీవాల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తుది తీర్పు వెలువరించనుందని తెలిపారు. ఇక ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాలని న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. తుది ఆదేశాలను హైకోర్టు వెలువరించాల్సి ఉన్న తరుణంలో తాము కలుగజేసుకొని ఉత్తర్వులు ఇవ్వడం అనేది న్యాయసమ్మతం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అంటే అప్పటివరకు కేజ్రీవాల్ తిహాడ్ జైలులోనే ఉండాలి.
బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గురువారం(జూన్ 20) ఇచ్చిన ఉత్తర్వును దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదనలను తాము వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుదేజా సభ్యులుగా ఉన్న సెలవుకాల ధర్మాసనం తెలిపింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24 కల్లా లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఇరు పక్షాలకు సూచించింది. రికార్డులన్నీ పరిశీలించాల్సి ఉన్నందున తమ తీర్పును రెండు మూడు రోజులపాటు రిజర్వులో ఉంచుతున్నట్లు తెలిపింది. బెయిల్‌ని నిలుపుదల చేస్తూ హైకోర్టుకు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఐక్యంగా పార్లమెంట్‌కు ఇండియా కూటమి నేతలు- రాజ్యాంగ ప్రతులతో ఎంపీల నిరసనలు - Lok Sabha Session 2024
'మీ ప్రేమే నన్ను కాపాడింది'- వయనాడ్ ప్రజలకు రాహుల్ ఎమోషనల్ లెటర్ - Rahul Gandhi Emotional Letter