Kasparov Comments On Rahul Gandhi : కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఇప్పుడు ఆ పార్టీ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు. రాయ్‌బరేలీలో విజయ పతాకం ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలో చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్, భారత రాజకీయాలపై స్పందించడం చర్చనీయాశంగా మారింది! ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళుతూ రాహుల్ గాంధీ తన ఫోన్‌లో చెస్ ఆడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. తన అభిమాన చెస్ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ అని, రాజకీయాలకు, చెస్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని రాహుల్ అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకుల్లో తానే ఉత్తమ చెస్ ప్లేయర్ అని రాహుల్ అన్నారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కాంగ్రెస్ పోస్ట్‌పై వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ పోస్టుపై ఓ యూజర్ వ్యంగ్యంగా స్పందించారు. కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్ ఆటకు త్వరగా గుడ్‌బై చెప్పారని, వారికి మన కాలంలోని గొప్ప మేథావిని ఎదుర్కొనే అవకాశం రాలేదని, ఇది తనకు రిలీఫ్‌గా ఉందని ఆ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. దీనిపై నటుడు రణవీర్ షోరే కూడా పోస్ట్ చేశాడు. రణవీర్ షోరే చేసిన పోస్ట్‌పై కాస్పరోవ్ స్పందించారు.
కాస్పరోవ్ సలహా
రాహుల్ గాంధీకి చెస్‌పై ఉన్న ప్రేమకు సంబంధించి దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ఓ సలహా ఇచ్చారు. చెస్‌లో అగ్రస్థానానికి పోటీపడే ముందు మొదట రాయ్‌బరేలీలో గెలవాలని కాస్పరోవ్ పేర్కొన్నారు. కాస్పరోవ్ ఆశ్చర్యకరమైన రాజకీయ పోస్ట్ చాలామందిని విస్మయానికి గురిచేసింది. "అగ్రస్థానానికి సవాలు చేసే ముందు మీరు మొదట రాయబరేలీ నుంచి గెలవాలి" అని నవ్వు ఎమోజీతో కాస్పరోవ్ పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన పోస్టుకు కాస్పరోవ్ సరదాగా స్పందించారు.
విమర్శలతో దిద్దుబాటు
రాహుల్‌పై కాస్పరోవ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల కాస్పరోవ్ మరో పోస్ట్ పెట్టారు. భారత రాజకీయాలపై తనది చిన్న జోక్ మాత్రమే అని కాస్పరోవ్ అన్నారు. భారత రాజకీయాలను తన చిన్న జోక్ ప్రభావితం చేయదని ఆశిస్తున్నానని, అయితే తనకు నచ్చిన చెస్ ఆటలో మాత్రం రాజకీయ నాయకుడు ఆడటం చూడకుండా ఉండలేనని కాస్పరోవ్ మరో పోస్ట్ చేశారు. అ రాజకీయ నాయకులను చమత్కరించడం తనకు ఎంతో ఇష్టమైన ఆటగా కాస్పరోవ్ అభివర్ణించారు. రష్యా అధినేత పుతిన్‌పైనా కాస్పరోవ్ ఇలాంటి సున్నితమైన విమర్శలు చేసేవారు. భారత రాజకీయాల్లో తాను చేసిన జోక్ అందరికీ అర్థం కాలేదని భావిస్తున్నానట్లు కూడా కాస్పరోవ్ అన్నారు.
చెస్ దిగ్గజం కాస్పరోవ్
రష్యాకు చెందిన 61 ఏళ్ల కాస్పరోవ్ చదరంగంలో ఎన్నో ఘనతలు సాధించారు. అతి చిన్న వయసులోనే (22 ఏళ్లకు) ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించారు. చెస్‌లో చాలాసార్లు ప్రపంచ విజేతగా నిలిచారు. 2005లో రిటైర్ అయిన ఆయన తరచూ రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. కాగా, భారత్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు గుకేశ్ కాస్పరోవ్ రికార్డును బద్దలుకొట్టడం వల్ల ఇటీవల కాస్పరోవ్ ఇటీవల శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. గుకేశ్‌ను భారత భూకంపం అని కితాబిచ్చారు.
కాంగ్రెస్ కంచుకోటలో రాహుల్ Vs దినేశ్- రాయ్‌బరేలీలో హోరాహోరీ తప్పదా? - lok sabha elections 2024
రాయ్‌బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ- మరి అమేఠీ నుంచి ఎవరంటే? - Lok Sabha Elections 2024