Kamal Haasan MNM DMK Alliance : తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో కమల్ హాసన్ మక్కల్ నీది మయం (ఎంఎన్‌ఎం) పార్టీ కూడా చేరింది. రానున్న లోకసభ ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్ తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా, ఎంఎన్ఎంకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూటమి అంగీకరించింది.
శనివారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కమల్ హాసన్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున ఎంఎన్‌ఎం పార్టీ ప్రచారం చేయనుంది. ఈ సమావేశం అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. 'నాకు ఎలాంటి పదవులు వద్దు. దేశ ప్రయోజనాలను ఆకాంక్షించి కూటమిలో చేరా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం లేదు. డీఎంకే-కాంగ్రెస్ కూటమికే పూర్తి మద్దతు' అని కమల్ హాసన్ ప్రకటించారు.
-
#WATCH | MNM chief and actor Kamal Haasan met Tamil Nadu CM MK Stalin and state Minister Udhayanidhi Stalin at the DMK office in Chennai.
— ANI (@ANI) March 9, 2024
(Source: DMK) pic.twitter.com/cc3BiDKGCC
మరోవైపు, శనివారం సాయంత్రం డీఎంకే, కాంగ్రెస్ నేతలు కీలక సమావేశంలో పాల్గొనున్నారు. దీని తర్వాత రాష్ట్రంలో విపక్ష ఇండియా కూటమి పార్టీల సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటక చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులో కాంగ్రెస్‌కు 10 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సీపీఐ, సీపీఎంలకు రెండు చొప్పున స్థానాలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
దేశం గురించి ఆలోచించే వారితోనే కలుస్తాం
ఇటీవలే మక్కల్ నీది మయ్యం ఏడో వార్షికోత్సవం సందర్భంగా తమ పార్టీ ఇండియా కూటమితో లేదని చెప్పారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే పార్టీలకు మాత్రమే తాము మద్దతిస్తామని కమల్ హాసన్ పేర్కొన్నారు. భూస్వామ్య రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పుకొచ్చారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కూటమికే మద్దతు ఇస్తున్నట్లు కమల్ ప్రకటించారు.
చైనా సరిహద్దులో 'సేలా టన్నెల్' ప్రారంభం- అరుణాచల్ వస్తే 'మోదీ గ్యారంటీ' చూడొచ్చన్న ప్రధాని
'భారత ప్రజలారా క్షమించండి'- ఇండియాతో వివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు