ETV Bharat / bharat

'అర్బన్‌ నక్సల్స్‌ సానుభూతిపరులతో కాంగ్రెస్ హైజాక్'- విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ - PM Modi JK Visit

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

PM Modi JK Visit : జమ్ముకశ్మీర్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, విపక్షాలపై విరుచుకుపడ్డారు. అర్బన్ నక్సల్స్​ సానుభూతిపరులతో కాంగ్రెస్ పార్టీ హైజాక్​ అయిందని విమర్శించారు. జమ్ముకశ్మీర్​ ప్రజలు కాంగ్రెస్‌, ఎన్​సీపీ, పీడీపీ మూడు పార్టీలతో విసిగిపోయారని ధ్వజమెత్తారు.

PM Modi JK Visit
PM Modi JK Visit (ANI)

PM Modi JK Visit : అర్బన్‌ నక్సల్స్‌ సానుభూతిపరులతో కాంగ్రెస్ హైజాక్ అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్, NC, PDP పార్టీలు రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని చెప్పారు. జమ్ములోని M.A.M మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు. జమ్ముకశ్మీర్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారనీ ఉగ్రవాదం, వేర్పాటు వాదం లేని ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు.

'ఆ 3 పార్టీలతో ప్రజలు విసిగిపోయారు'
కాంగ్రెస్‌, ఎన్​సీపీ, పీడీపీ ఈ మూడు కుటుంబ పార్టీలతో జమ్ముకశ్మీర్‌ ప్రజలు విసిగిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, ఉద్యోగాల్లో వివక్షను ఇక్కడి ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతానికి దూరంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారని ప్రధాని అన్నారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల విలువ కాంగ్రెస్‌కు తెలియదంటూ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు.

'జవాన్లను కాంగ్రెస్ అవమానించింది'
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దుల్లో కాల్పులు జరిగితే, ఆ పార్టీ తెల్ల జెండాలను ఎగురవేసిందని, కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగిందన్నారు. "2016 సెప్టెంబరు 28 రాత్రి సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగింది. శత్రువుల భూభాగంలోకి వెళ్లి దాడి చేయగలిగిన సరికొత్త భారత్‌ను నాడు ప్రపంచమంతా చూసింది. దేశ రక్షణ కోసం జవాన్లు చేసిన త్యాగం విలువ ఆ పార్టీకి తెలియదు. జవాన్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ గౌరవించలేదు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ సైనికులకు మాయమాటలు చెప్పింది. 'వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌' ఇస్తామంటూ వారిని ఎదురుచూసేలా చేసింది" అని ప్రధాని ఆరోపించారు.

పూర్తి మెజారిటీతో అధికారంలోకి
ఇటీవల జమ్ముకశ్మీర్‌లో జరిగిన తొలిదశ ఎన్నికల్లో మొత్తం 61 శాతం పోలింగ్‌ నమోదవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. "ఈసారి విజయదశమి మనందరికీ ఎంతో ప్రత్యేకం. జమ్ముకశ్మీర్‌లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. పూర్తి మెజారిటీ అధికారంలోకి వస్తుంది" అని విశ్వాసం వ్యక్తంచేశారు.

'జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం చివరి శ్వాస తీసుకుంటోంది- ప్రజల ఫ్యూచర్​ డిసైడ్​ చేసేది ఈ ఎన్నికలే!' : ప్రధాని మోదీ - PM Narendra Modi Comments

'ప్రజారోగ్యం విషయంలో స్వచ్ఛ భారత్‌ ఒక గేమ్‌ ఛేంజర్‌' - ప్రధాని మోదీ - Modi Swachh Bharat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.