ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో​ కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - నేషనల్​ కాన్ఫరెన్స్​ ముందంజ

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 18 minutes ago

JK Assembly Election Results
JK Assembly Election Results (ETV Bharat)

JK Assembly Election Results : జమ్ముకశ్మీర్‌ శాసనసభ ఎన్నికల కౌంటింగ్​ కొనసాగుతోంది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల ఇక్కడి 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 63.45 శాతం పోలింగ్ నమోదైంది. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల జమ్ముకశ్మీర్​ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. అయితే, ఇక్కడ ఐదుగురుఎమ్మెల్యేలను ఎల్‌జీ నామినేట్‌ చేయనున్నారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు 48కి చేరనుంది. కాగా, జమ్ముకశ్మీర్‌లో ఏ పార్టీ ఈ మార్కును అందుకోలేదని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

LIVE FEED

9:20 AM, 8 Oct 2024 (IST)

జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌దే ఆధిక్యం

  • 38 స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ముందంజ
  • పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఒమర్‌ అబ్దుల్లా
  • భాజపా 23 స్థానాల్లో, పీడీపీ 3 చోట్ల, కాంగ్రెస్‌ 7, ఇతరులు 5 నియోజకవర్గాల్లో ముందంజ

8:43 AM, 8 Oct 2024 (IST)

10చోట్ల నేషనల్‌ కాన్ఫరెన్స్‌, రెండు చోట్ల బీజేపీ ముందంజ

  • కొనసాగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • జమ్మూకశ్మీర్‌లో 10చోట్ల నేషనల్‌ కాన్ఫరెన్స్‌, రెండు చోట్ల బీజేపీ ముందంజ
  • జమ్మూకశ్మీర్‌లో ఒకచోట పీడీపీ, మరోచోట కాంగ్రెస్‌ ముందంజ

8:02 AM, 8 Oct 2024 (IST)

కౌంటింగ్​ స్టార్ట్​

జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం అయింది. భారీ భద్రత నడుమ 28 కౌంటింగ్​ సెంటర్లలో ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 100 మీటర్లకు ఒక చెక్​ పాయింట్​ ఏర్పాటు చేశామని, అన్ని స్ట్రాంగ్​ రూముల్లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గుర్తింపు లేని వ్యక్తులను ఈ ప్రాంతంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మొదటగా పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు లెక్కించి, ఆ తర్వాత ఈవీఎం ఓట్లు కౌంట్​ చేస్తామని తెలిపారు. ఇక కౌంటింగ్ ప్రక్రియను మానిటర్​ చేయడానికి ఎన్నికల సంఘం కొందరు పరిశీలకులను నియమించింది.

6:50 AM, 8 Oct 2024 (IST)

భారీ భద్రత ఏర్పాట్లు

ఓట్ల లెక్కింపు కోసం జమ్ముకశ్మీర్​లోని 20 కౌంటింగ్ కేంద్రాల వద్ద, జిల్లా ప్రధాన కార్యాలయాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లెక్కింపు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

Last Updated : 18 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.