ETV Bharat / bharat

అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ​ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్​లు కూడా! - IRCTC Spiritual Telangana Srisailam

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 6:13 PM IST

IRCTC Srisailam Tour: దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు చూడాలనుకునేవారి కోసం IRCTC పలు ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్‌ ప్యాకేజ్‌ మూడు రాత్రులు, 4 రోజులు ఉండనుంది. మరి ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? టూర్‌ ఎలా సాగుతుంది.? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో మీకోసం..

IRCTC Srisailam Tour
IRCTC Spiritual Telangana with Srisailam (ETV Bharat)

IRCTC Spiritual Telangana with Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలని, పర్యాటక ప్రదేశాలను చూడాలని చాలా మందికి ఉంటుంది. అయితే పలు కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. అయితే అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ ఒక మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. మూడు రాత్రులు, 4 రోజులు ఈ టూర్‌ ప్యాకేజ్‌ ఉండనుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? టూర్‌ ఎలా సాగుతుంది.? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో మీకోసం..

ఐఆర్‌సీటీసీ టూరిజం "Spiritual Telangana with Srisailam" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. ఇది 3 రాత్రులు, 4 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్ ప్రతీ ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్​లోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు శ్రీశైలం, యాదాద్రి పుణ్యక్షేత్రాలు కవర్ అవుతాయి. హైదరాబాద్‌ వాసులతో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ జులై 14వ తేదీ నుంచి మొదలుకానుంది.

బ్యాంకాక్ చూసొద్దామా బాసూ..? - IRCTC సూపర్ ప్యాకేజీ! - సఫారీ వరల్డ్ టూర్ కూడా! - IRCTC Treasures of Thailand Ex Hyd

ప్రయాణ వివరాలు చూస్తే..

  • ఐఆర్‌సీటీసీ టూర్‌లో భాగంగా మొదటి రోజు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌/కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రయాణికులను పికప్‌ చేసుకుంటారు. హోటల్‌లోకి చెకిన్‌ అయిన తర్వాత చార్మినార్‌, సలార్‌జంగ్‌ మ్యూజియం, లుంబిని పార్క్‌ చూపిస్తారు. ఆ తర్వాత హోటల్‌ చేరుకుంటారు. రాత్రికి హైదరాబాద్​లో బస ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్​ నుంచి శ్రీశైలం స్టార్ట్​ అవుతారు. మధ్యలో బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లిఖార్జున స్వామి దర్శనం ఉంటుంది. తర్వాత అక్కడి స్థానిక ఆలయాలను చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్​ బయలుదేరుతారు. రాత్రికి హైదరాబాద్​లోనే స్టే చేయాలి.
  • మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత బిర్లా మందిర్​కు తీసుకెళ్తారు. ఆ తర్వాత గొల్కోండ ఖిల్లాను చూస్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత అంబేడ్కర్ విగ్రహంతో పాటు స్థానికంగా ఉన్న పలు సందర్శనీయ ప్రదేశాలను చూపిస్తారు. రాత్రి హైదరాబాద్​లోనే బస చేస్తారు.
  • ఇక టూర్‌లో చివరి రోజైన నాలుగో రోజు యాదాద్రికి వెళ్తారు. అక్కడ నరసింహ స్వామి దర్శనంతో పాటు సురేంద్రపురి కూడా చూడొచ్చు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

శ్రీశైలం టూర్ ప్యాకేజీ ధరల వివరాలు: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ టూరిజం ప్యాకేజీ ధరలను చూస్తే.. సింగిల్ షేరింగ్ కు రూ. 37,200గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19,530, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14,880గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు విత్​ బెడ్​తో రూ. 9,780, విత్​ అవుట్​ బెడ్​తో రూ. 9,780 గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టూర్‌ బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేసి తెలుసుకోవచ్చు.

"హిమాలయాల్లో సూర్యోదయపు అందాలు" - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - అందుబాటు ధరల్లోనే! - IRCTC Hyderabad Nepal Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.