IRCTC Sai Shivam Tour package: ఫ్యామిలీతో కలిసి షిరిడీ వెళ్లాలనుకునేవారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. కేవలం మూడు రోజుల్లో షిరిడీ, నాసిక్‌లను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్యాకేజీని కూడా తక్కువ ధరకే అందిస్తోంది. మరి ఈ టూర్లో ఏఏ ప్రదేశాలు కవర్ అవుతాయో ఈ స్టోరీలో చూద్దాం..
షిరిడీ, నాసిక్‌ను చూసేందుకు "సాయి శివం(Sai Shivam)" పేరుతో IRCTC ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లు సాగుతుంది. ప్రతీ శుక్రవారం ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. తక్కువ సమయంలో ఆధ్యాత్మిక యాత్ర కంప్లీట్ చేయాలనుకునే వారికి ఈ యాత్ర అనుకూలంగా ఉంటుంది. కంఫర్ట్ ఎంచుకున్న వారికి థర్డ్ ఏసీలో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్ ఎంచుకున్న వారికి స్లీపర్ క్లాస్‌లో బెర్త్ కేటాయిస్తారు.
ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6.40 గంటలకు 17064 రైలు (అజంతా ఎక్స్‌ప్రెస్) ప్రారంభం అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి పికప్ చేసుకుని షిరిడీలో ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అనంతరం హోటల్ నుంచి నడక మార్గంలో ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. టికెట్ ధర యాత్రికులే భరించాలి. కావాలంంటే శనిసింగనాపూర్‌కు ప్రయాణికులు వెళ్లి రావొచ్చు. రాత్రంతా షిరిడీలోనే బస ఉంటుంది.
- మూడో రోజు షిరిడీ నుంచి 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాసిక్‌కు ప్రయాణం ఉంటుంది. అక్కడ త్రయంబకేశ్వరంలోని జ్యోతిర్లింగ ఆలయ దర్శనం తర్వాత నాసిక్‌లోని పంచవటి దర్శనం ఉంటుంది. స్థానికంగా ఉన్న దర్శనీయ స్థలాలను దర్శించుకోవచ్చు. సాయంత్రానికి మళ్లీ నాగర్‌సోల్ స్టేషన్‌కు ప్రయాణం ఉంటుంది. రాత్రి 8.30 గంటలకు 17063 రైలు హైదరాబాద్‌కు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- నాలుగోరోజు సోమవారం ఉదయం 9:45 గంటలకు రైలు కాచిగూడ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజీ ధరలు
కంఫర్ట్:
- సింగిల్ షేరింగ్ - రూ. 9,320
- ట్విన్‌షేరింగ్ - రూ. 7,960
- ట్రిపుల్ షేరింగ్ - రూ. 7,940
- చైల్డ్ విత్ బెడ్ (5-11 ఏళ్లు) - రూ.7,835
- చైల్డ్ వితౌట్ బెడ్ (5-11 ఏళ్లు) - రూ.6,845
స్డాండర్డ్
- సింగిల్ షేరింగ్ - రూ. 7,635
- ట్విన్ షేరింగ్ - రూ. 6,270
- ట్రిపుల్ షేరింగ్ - రూ. 6,250
- చైల్డ్ విత్ బెడ్ (5-11 ఏళ్లు) - రూ. 6,150
- చైల్డ్ వితౌట్ బెడ్ (5-11 ఏళ్లు) - రూ. 5,160
ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్
- ప్రయాణికులు ఎంపిక చేసుకున్న తరగతిని బట్టి ప్రయాణం(స్లీపర్, థర్డ్ ఏసీ) ఉంటుంది.
- ఒక చోటు నుంచి ఒక చోటుకు రవాణా సదుపాయం ఉంటుంది.
- ఉదయం పూట రెండు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ సదుపాయం ప్యాకేజీలో భాగంగా ఉంటుంది.
- ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం ఉంటుంది.
- ప్రస్తుతం ఈ టూర్ జులై 12వ తేదీన మొదలుకానుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.