IRCTC Gujarat Package: గుజరాత్ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. అయితే వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో కవర్ చేయాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజీ మీ కోసమే. గుజరాత్‌లోని పర్యాటక స్థలాలను చూడటం కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) "సుందర్ సౌరాష్ట్ర" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లుగా ఈ టూర్ కొనసాగుతుంది. సికింద్రాబాద్‌తో పాటు గుల్బర్గా, కళ్యాణ్, పుణె, సోలాపుర్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..
రైలు ప్రయాణం ఇలా...
- మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్-పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 20967) రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 11 గంటలకు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అయ్యాక మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా మూర్తి)ని వీక్షించి తిరిగి వడోదరా చేరుకుంటారు. రాత్రి అక్కడే స్టే చేయాలి.
- మూడో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని చూసి అహ్మదాబాద్ బయల్దేరుతారు. అక్కడ సబర్మతీ ఆశ్రమం, అక్షరధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి అహ్మదాబాద్‌లో బస ఉంటుంది.
- నాలుగో రోజు ద్వారక బయలుదేరతారు. మార్గమధ్యలో జామ్‌నగర్ కోట, మ్యూజియం చూడొచ్చు. సాయంత్రానికి ద్వారక చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం ద్వారకాదీష్ టెంపుల్‌ను దర్శించుకుంటారు. తర్వాత బెట్ ద్వారక, నాగేశ్వర్ టెంపుల్, శివరాజ్‌పూర్ బీచ్ చూసి తిరిగి ద్వారకకు రిటన్ అవుతారు. రాత్రికి ద్వారకలోనే బస చేయాలి.
- ఆరో రోజు సోమ్‌నాథ్‌కు స్టార్ట్ అవుతారు. మార్గమధ్యలో పోర్‌బందర్ కీర్తి మందిర్, సుధామా టెంపుల్ చూడొచ్చు. సోమ్‌నాథ్‌కు చేరుకున్న తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకుంటారు. తర్వాత పోర్‌బందర్ చేరుకుంటారు.
- ఏడో రోజు అర్ధరాత్రి 00:50 గంటలకు పోర్‌బందర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం.20968 )లో తిరిగి సికింద్రాబాద్‌కు పయనమవుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఎనిమిదో రోజు ఉదయం 8:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ పూర్తవుతుంది.
ప్యాకేజీలో ఉండేవి ఇవీ..
- యాత్రకు వెళ్లి రావడానికి రైలు టికెట్లు (3 ఏసీ, స్లీపర్ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.
- ఏసీ గదిలో బస, ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.
- నాలుగు రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది.
- ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.
- టూర్ ప్యాకేజీలో ఉండే సందర్శనా ప్రదేశాల రుసుముల బాధ్యత ఐఆర్‌సీటీసీదే.
ప్యాకేజీ వివరాలు ఇవీ.. (టికెట్ ధర ఒక్కొక్కరికీ)..
- కంఫర్ట్‌లో ట్విన్ షేరింగ్‌కు రూ.28,280, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.27,610 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.22,060, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.20,020 చెల్లించాలి.
- స్టాండర్డ్‌లో ట్విన్ షేరింగ్‌కు రూ.25,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.24,760 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.19,210, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.17,170 పే చేయాలి. చెల్లించాలి.
- ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
హైదరాబాద్ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra