ETV Bharat / bharat

"ఈ మంచుల్లో.. ప్రేమంచుల్లో.." - కశ్మీర్​ అందాల వీక్షణకు IRCTC స్పెషల్​ ప్యాకేజీ! - IRCTC Mystical Kashmir Tour - IRCTC MYSTICAL KASHMIR TOUR

IRCTC Kashmir Tour: చుట్టూ మంచు పర్వతాలు.. ఎత్తైన కొండలు.. వాటి మధ్యలో రోప్‌ జర్నీ చేస్తే ఎలా ఉంటుంది? మీరు కూడా అలాంటి థ్రిల్ల్​ ఫీల్​ అవ్వాలనుకుంటే ఓ సారి కశ్మీర్​ వెళ్లాల్సిందే. ఇందుకోసం తక్కువ ధరలోనే ఐఆర్​సీటీసీ ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

IRCTC kashmir Tour
IRCTC kashmir Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 1:51 PM IST

IRCTC Mystical Kashmir Ex Hyderabad Tour: నార్త్​ ఇండియాలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్‌ ఒకటి. శ్రీనగర్‌ అందాలు.. మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం.. అబ్బో ఊహించుకుంటేనే మంచులో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. ఇక, నేరుగా ఆస్వాదిస్తే? ఆ మజానే వేరు. ఆ అందాల్ని అస్వాదించాలనుకునే వారికోసం IRCTC సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. మరి టూర్​ ప్రయాణం ఎన్ని రోజులు? ధర ఎంత? ఏయే ప్రదేశాలు కవర్​ అవుతాయి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

"కశ్మీర్‌ ఎక్స్‌ హైదరాబాద్‌" పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. జూన్​ 19న హైదరాబాద్‌ నుంచి విమానం ప్రయాణం ద్వారా ఈ టూర్​ మొదలవుతుంది. ఈ టూర్‌ మొత్తం ఐదు రాత్రులు 6 పగళ్లు కొనసాగుతుంది.

విమాన ప్రయాణం వివరాలు ఇలా..

  • హైదరాబాద్‌ నుంచి ఉదయం 10 గంటలకు విమానం (6E- 108) బయల్దేరుతుంది. సాయంత్రం శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుతారు. అక్కడ ముందుగానే బుక్‌ చేసిన హోటల్​కి తీసుకెళ్తారు.
  • ఫ్రెషప్​ తర్వాత సూర్యాస్తమయాన్ని వీక్షించటానికి సాయంత్రం దాల్‌ సరస్సుకు తీసుకెళ్తారు. అక్కడున్న చార్‌-చినార్‌ (ప్లోటింగ్‌ గార్డెన్స్‌) వీక్షించొచ్చు. అయితే ఇక్కడ రుసుములు యాత్రికులే చెల్లించాలి. రాత్రి శ్రీనగర్​ హోటల్‌లోనే బస ఉంటుంది.
  • రెండో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత బంగారు గడ్డి మైదానంగా పేరొందిన సోన్‌మార్గ్‌కు తీసుకెళ్తారు. అక్కడ మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, మంచుతో కప్పిన రోడ్లను చూసి మైమరిచిపోవచ్చు.
  • ఈ పర్యటనలో తాజ్వాస్ గ్లేసియర్‌ (హిమానీనదం) ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వీటిని చూసిన తర్వాత శ్రీనగర్‌కు వచ్చి హోటల్లో స్టే చేస్తారు. రాత్రికి అక్కడే భోజనం ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం గుల్‌మార్గ్‌కు బయల్దేరుతారు. అక్కడ పూలతో నిండిన రోడ్ల మార్గం ద్వారా ప్రయాణించి గుల్‌మార్గ్‌ గోండోలాకు చేరుతారు. అక్కడ రోప్‌వే ప్రయాణం మైమరిపిస్తుంది. దానికి యాత్రికులే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అక్కడ ఎంజాయ్​ చేసిన తర్వాత రాత్రి తిరిగి శ్రీనగర్‌ చేరడంతో మూడోరోజు పర్యటన ముగుస్తుంది.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra

  • నాలుగో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పహల్గామ్‌కు ప్రయాణం ఉంటుంది. సముద్ర తీరానికి 2440 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఉండే లోయ అందాలను వీక్షించాక.. తిరుగు ప్రయాణంలో కుంకుమపువ్వు పంట అందాలు, అవంతిపూర్ శిథిలాలు వీక్షించొచ్చు. ఆ రోజు రాత్రి పహల్గామ్‌ హోటల్‌లోనే భోజనం చేసి అక్కడే స్టే చేస్తారు.
  • ఐదో రోజు అదే హోటల్‌లో టిఫెన్​ చేసి శ్రీనగర్‌కు చేరుకుంటారు. చెష్మషాహి, మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్, పరిమహల్, షాలిమార్ గార్డెన్స్ సందర్శనా స్థలాలను వీక్షించొచ్చు. తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్‌బల్‌ను సందర్శించుకోవచ్చు. ఇక సాయంత్రం ఆదిశంకరాచార్య మందిరాన్ని దర్శించుకున్న రాత్రి హౌస్‌బోట్‌లో బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హౌస్​బోట్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు (6E – 6718) పయనమవుతారు. హైదరాబాద్ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్‌?

  • ఆరు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం కవర్ అవుతుంది.
  • త్రీ స్టార్‌ హోటల్‌లో బస ఉంటుంది.
  • మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర ఆహారపదార్థాలన్నీ యాత్రికులే చూసుకోవాలి.
  • విమాన ప్రయాణంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా యాత్రికులే చెల్లించాలి.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే టూరిస్టులే చెల్లించాలి.

ప్యాకేజ్‌ ఛార్జీలు..

  • కంఫర్ట్​లో సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.58,565 చెల్లించాలి.
  • ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.52,930 చెల్లించాలి.
  • ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.51,300
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.41,210 పే చేయాలి.
  • ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.