ETV Bharat / bharat

కేరళ అందాలు చూసొస్తారా? - తక్కువ ధరలోనే ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ! - IRCTC Kerala Hills and Water Tour Package - IRCTC KERALA HILLS AND WATER TOUR PACKAGE

IRCTC Kerala Tour: కేరళ ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా?అయితే మీకో గుడ్​న్యూస్​. ఐఆర్​సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్ చేస్తోంది. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

IRCTC Kerala Tour
IRCTC Kerala Hills and Water Tour Package (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 7, 2024, 11:22 AM IST

IRCTC Kerala Hills and Water Tour Package: ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ .. యాత్రికుల కోసం రకరకాల ప్యాకేజీలను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు మొదలు చారిత్రక ప్రదేశాల సందర్శన వరకు అందుబాటు ధరలలో ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తోంది. తాజాగా కేరళ అందాలను చూసేందుకు వీలుగా ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ టూర్​ ఎన్ని రోజుల సాగుతుంది? ధర వివరాలు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC టూరిజం 'KERALA HILLS & WATERS ' పేరుతో హైదరాబాద్​ నుంచి ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఈ ట్రిప్​లో మున్నార్, అలెప్పీతో పాటు పలు టూరిజం స్పాట్లు కవర్ అవుతాయి. ధర కూడా అందుబాటు ధరలోనే ఉంది.

హైదరాబాద్ - కేరళ ట్రిప్ ప్రయాణం ఇలా:

  • మొదటి రోజు హైదరాబాద్​లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Train No.17230, Sabari Express) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్​లోకి చెకిన్ అయిన తర్వాత.. సాయంత్రం మున్నార్​టౌన్​లో పలు ప్రదేశాలు చూస్తారు. రాత్రి మున్నార్ లోనే స్టే చేస్తారు.
  • మూడో రోజు ఉదయం Eravikulam National Parkను సందర్శిస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్​తో పాటు ఏకో పాయింట్​ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్​లోనే బస చేస్తారు.
  • 4వ రోజు హోటల్ నుంచి చెక్​ అవుట్​ చేసి అలెప్పీకి వెళ్తారు. హోటల్​లోకి చెకిన్ అయిన తర్వాత.. backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
  • 5వ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
  • 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

తక్కువ ధరలో పుణ్యక్షేత్రాల దర్శనం - IRCTC స్ఫెషల్​ ప్యాకేజీ - పూర్తి వివరాలివే! - IRCTC Divya Dakshin Yatra

ధరలు చూస్తే:

ఒకటి నుంచి ముగ్గురు ప్రయాణికులకు ధరలు చూస్తే..

  • కంఫర్ట్​లో సింగిల్ షేరింగ్ కు రూ. 32,830గా ఉంది. ట్విన్​ షేరింగ్​ రూ.19,070, ట్రిపుల్​ షేరింగ్​ రూ .15,590గా ఉంది.
  • స్టాండర్డ్​లో సింగిల్ షేరింగ్ కు రూ. 30,130గా ఉంది. ట్విన్​ షేరింగ్​ రూ.16,370, ట్రిపుల్​ షేరింగ్​ రూ .12,880గా ఉంది.

నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులకు ధరలు చూస్తే..

  • కంఫర్ట్​లో ట్విన్​ షేరింగ్​ రూ.17,160, ట్రిపుల్​ షేరింగ్​ రూ .14,980గా ఉంది.
  • స్టాండర్డ్​లో ట్విన్​ షేరింగ్​ రూ.14,450, ట్రిపుల్​ షేరింగ్​ రూ .12,280గా ఉంది.
  • ఇక 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.
  • ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయవచ్చు.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra

హైదరాబాద్​ To షిరిడీ- IRCTC స్పెషల్ టూర్‌​ ప్యాకేజీ- అతి తక్కువ ధరలో సాయి దర్శనం! - irctc shirdi tour package

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.