ETV Bharat / bharat

తక్కువ ధరలో పుణ్యక్షేత్రాల దర్శనం - IRCTC స్ఫెషల్​ ప్యాకేజీ - పూర్తి వివరాలివే! - IRCTC Divya Dakshin Yatra

IRCTC Divya Dakshin Yatra: దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించాలనుకుంటున్నారా? అయితే.. ఐఆర్‌సీటీసీ నుంచి మీకో గుడ్​న్యూస్. ​ప్రముఖ దేవాలయాలతోపాటుగా జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్​సీటీసీ ఓ స్పెషల్​ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Divya Dakshin Yatra
IRCTC Divya Dakshin Yatra (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 11:00 AM IST

IRCTC Divya Dakshin Yatra with Jyotirlinga: చాలా మందికి దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శించుకోవాలని ఉంటుంది. అయితే.. అక్కడికి వెళ్లడం ఎలానో తెలియక కొందరు.. ఛార్జీలు ఎక్కువ అవుతాయని ఇంకొందరు.. వెనుకడుగు వేస్తుంటారు. అయితే.. అలాంటి వారికి ఇక టెన్షన్​ అక్కర్లేదు. వారి కోసమే.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ టూర్​ ఎన్నిరోజులు సాగుతుంది? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

ఐఆర్​సీటీసీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. జూన్​ 22న ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుంది. ఇక్కడ సికింద్రాబాద్ మొదలు వరుసగా కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ ట్రైన్ ఎక్కొచ్చు. ప్రయాణం అయిపోయాక పైన తెలిపిన స్టేషన్లలో దిగొచ్చు. ఇక ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది.

ప్రయాణ వివరాలు ఇవే..

  • మొదటి రోజు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ట్రైన్ జర్నీ స్టార్ట్​ అవుతుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటారు. అక్కడ అరుణాచలం ఆలయం దర్శించుకొని.. తిరిగి రైల్వే స్టేషన్‌కు వచ్చి మధురై వెళ్తారు.
  • మూడో రోజు ఉదయం 8 గంటలకు మధురై చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సులో రామేశ్వరం చేరుకుంటారు. హోటల్​కి వెళ్లి ఫ్రెషప్​ తర్వాత అక్కడ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రయాణ ఖర్చులు యాత్రికులే భరించాలి. ముందుగా ఏర్పాటు చేసిన హోటల్లో రాత్రి భోజనం ఉంటుంది. బస రామేశ్వరంలో ఉంటుంది.
  • నాలుగో రోజున రామేశ్వరంలో మధ్యాహ్న భోజనం ముగించి.. మధురై ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి టెంపుల్‌కు వెళ్లి.. దర్శనం తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత రైలులో కన్యాకుమారి బయల్దేరతారు.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra

  • ఐదో రోజున కన్యాకుమారిలోని ప్రకృతి అందాలు వీక్షించొచ్చు. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం సహా సూర్యాస్తమయం చూడొచ్చు. రాత్రి భోజనం తర్వాత అక్కడే బస ఉంటుంది.
  • ఆరో రోజున మార్నింగ్.. కన్యాకుమారి స్టేషన్​కు వెళ్లి తిరువనంతపురం బయల్దేరతారు. అక్కడే టిఫిన్ చేసి అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని.. కోవలం బీచ్ అందాలు వీక్షించొచ్చు. తర్వాత తిరుచిరాపల్లి బయల్దేరాలి.
  • ఏడో రోజు మార్నింగ్ 5 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటారు. ఉదయం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ వెళ్లి దర్శనం తర్వాత మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి 60 కి.మీ. దూరంలో ఉన్న తంజావూర్ వెళ్లి బృహదీశ్వర ఆలయ దర్శనం చేస్తారు. తర్వాత తంజావూర్​ నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
  • 8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్​, కాజీపేట మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.

హైదరాబాద్ టూ కాశీ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ టూర్ - ధర కూడా అందుబాటులోనే! - IRCTC Ganga Ramayan Yatra

ప్యాకేజీ వివరాలివే:

  • ఎకానమీలో పెద్దలకు రూ.14,250; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ. 13,250 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌లో పెద్దలకు రూ.21,900; 5-11 చిన్నారులకు రూ.20,700 కట్టాలి.
  • కంఫర్ట్‌లో పెద్దలకు రూ.28,450... 5-11 ఏళ్ల చిన్నారుల కోసం రూ.27,010 కట్టాలి.
  • ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం రైల్వే సిబ్బంది చూసుకుంటారు.
  • ప్యాకేజ్ బట్టి ప్రయాణానికి ఏసీ వెహికిల్ సమకూరుస్తారు.
  • టూరిస్టులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
  • టూర్‌లో ఇతర ఛార్జీలు ప్రయాణికులు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ To తిరుపతి - IRCTC స్పెషల్​ ప్యాకేజీ- శ్రీవారి స్పెషల్​ దర్శనంతో పాటు మరెన్నో! - IRCTC Poorva Sandhya Tour Packages

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.