ETV Bharat / bharat

6 రోజుల్లో కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చుట్టొద్దామా? - తక్కువ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ! - IRCTC Karnatka Tour - IRCTC KARNATKA TOUR

IRCTC Karnataka Tour : కర్ణాటకలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు చూడాలనుకునేవారికి గుడ్​న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. మరి ఈ టూర్​ ఎలా సాగుతుంది? ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Divine Karnataka Tour
IRCTC Karnataka Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 6:43 PM IST

IRCTC Divine Karnataka Tour Package : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను చూడాలనుకునేవారి కోసం ఎప్పటికప్పుడు ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. తాజాగా కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు హైదరాబాద్​ నుంచి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్​లో.. పలు పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు. మరి ఈ టూర్​ ఎలా సాగుతుంది? ధర ఎంత? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల సందర్శనకు "డివైన్ కర్ణాటక"(Divine Karantaka) పేరుతో IRCTC టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తోంది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు,​ 6 పగళ్లు కొనసాగునుంది. కర్ణాటకలోని ఉడిపి, మంగుళూరు, శృంగేరి, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ఈ టూర్​కి సంబంధించిన ట్రైన్ బయలుదేరుతుంది.

ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ - మంగుళూరు సెంట్రల్​ ఎక్స్​ప్రెస్​(ట్రైన్​ నెం 12789) ఉదయం 06.05 గంటలకు రైలు బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్​కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి పికప్​ చేసుకుని ఉడిపికి తీసుకెళ్తారు. హోటల్​లో చెక్ ఇన్ అయిన తర్వాత శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పే బీచ్ విజిట్​ చేస్తారు. రాత్రి ఉడిపిలోనే బస ఉంటుంది.
  • మూడో ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయి శృంగేరికి బయలుదేరుతారు. అక్కడ శృంగేరి శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. లంచ్​ తర్వాత మంగుళూరు స్టార్ట్​ అవుతారు. మంగుళూరు చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆ రాత్రికి మంగుళూరులోనే స్టే ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం మంజునాథ ఆలయాన్ని సందర్శించేందుకు ధర్మస్థలానికి బయలుదేరుతారు. అక్కడ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి మంగుళూరు చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి మంగుళూరులోని స్థానిక దేవాలయాలైన.. మంగళ దేవి ఆలయం, కద్రి మంజునాథ దేవాలయం సందర్శిస్తారు. స్థానికంగా షాపింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి శ్రీ గోకర్ణనాథ క్షేత్రం సందర్శిస్తారు. రాత్రి 7:00 గంటలకు మంగుళూరు సెంట్రల్‌ రైల్వేస్టేషన్​లో డ్రాప్​ చేస్తే.. రైలు నెం. 12790లో తిరిగి హైదరాబాద్​కు రాత్రి 08:05 గంటలకు బయలుదేరుతారు. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

హైదరాబాద్​ To షిరిడీ - తక్కువ ధరలో నాలుగు రోజుల ప్రయాణం - సాయి దర్శనంతో పాటు మరెన్నో!

ప్యాకేజీ ధరలు చూస్తే..

1 - 3 ముగ్గురు వ్యక్తులు బుక్‌ చేసుకుంటే..

  • కంఫర్ట్​లో.. సింగిల్​ షేరింగ్​కి రూ. 37,770 ఛార్జ్ చేస్తారు. డబుల్​ షేరింగ్​కు రూ. 22,260, ట్రిపుల్​ షేరింగ్​ కోసం రూ. 17,990గా నిర్ణయించారు. ఇక ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు విత్​ బెడ్​తో రూ. 11,330, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 9,800 చెల్లించాల్సి ఉంటుంది.
  • స్టాండర్ట్‌లో.. సింగిల్ షేరింగ్​కి రూ.34,770, ట్విన్ షేరింగ్‌కు రూ.19,260, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,000. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.8,330, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ. 6,800 చెల్లించాలి.

నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్‌ చేసుకుంటే..

  • కంఫర్ట్‌లో.. డబుల్‌ షేరింగ్‌కు రూ.19,030, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.16,960 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌ అయితే రూ. 11,330, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,800 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌లో.. డబుల్‌ షేరింగ్‌కు రూ. 16,030, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.13,960 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.8,300, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 6,800 చెల్లించాలి.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​లోని పర్యాటక ప్రదేశాలతో పాటు యాదాద్రి దర్శనం - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

కృష్ణుడు ఏలిన ద్వారక చూసొస్తారా? తక్కువ ధరకే IRCTC ప్రత్యేక ప్యాకేజీ! మరెన్నో ప్రదేశాలు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.