ETV Bharat / bharat

IOCLలో 473 అప్రెంటీస్​ పోస్టులు - దరఖాస్తుకు మరో 10 రోజులే ఛాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 10:12 AM IST

IOCL Apprentice Jobs 2024 In Telugu : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలు చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్​ (IOCL) 473 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

IOCL Apprentice Jobs 2024
IOCL Recruitment 2024

IOCL Apprentice Jobs 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్ లిమిటెడ్​ (IOCL), పైప్​లైన్ డివిజన్​లోని 5 రీజియన్లలో టెక్నికల్​, నాన్​-టెక్నికల్​ ట్రేడుల్లోని 473 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • యూఆర్​ - 251 పోస్టులు
  • ఓబీసీ - 95 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 38 పోస్టులు
  • దివ్యాంగులు - 20 పోస్టులు
  • ఎస్టీ- 29 పోస్టులు
  • ఎస్సీ - 60 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 473

ట్రేడ్ విభాగాలు
మెకానికల్​, ఎలక్ట్రికల్​, టీ అండ్ ఐ, హ్యూమన్ రిసోర్స్​, అకౌంట్స్​/ ఫైనాన్స్​, డేటా ఎంట్రీ ఆపరేటర్​, డొమెస్టిక్​ డేటా ఎంట్రీ ఆపరేటర్​

పైప్​లైన్ రీజియన్స్​
వెస్ట్రన్, నార్తర్న్​, ఈస్ట్రన్​, సదరన్​, సౌత్ ఈస్ట్రన్​ రీజియన్స్​

విద్యార్హతలు
IOCL Apprentice Qualifications : అభ్యర్థులు 10+2 (ఇంటర్​)తో పాటు ఆయా పోస్టులకు అనుగుణంగా ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెకానికల్ ఇంజినీరింగ్​, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసినవారు కూడా ఈ పోస్టులకు అర్హులు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ చూడండి.

వయోపరిమితి
IOCL Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు 2024 జనవరి 12 నాటికి 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ ఫీజు
IOCL Apprentice Application Fee : అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
IOCL Apprentice Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
IOCL Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఐవోసీఎల్ అధికారిక వెబ్​సైట్ https://iocl.com/ ఓపెన్ చేయాలి.
  • Careers సెక్షన్​లోకి వెళ్లి IOCL Apprentice లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు కొత్త పేజీ ఓపెన్​ అయ్యి, రిజిస్ట్రేషన్​ లింక్​ కనిపిస్తుంది.
  • ఈ లింక్​పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
  • తరువాత మీ అకౌంట్​లోకి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అన్ని వివరాలను మరోసారి చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
IOCL Apprentice Apply Last Date :

  • ఆన్​లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 2024 జనవరి 12
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 1
  • అడ్మిట్​ కార్డ్ డౌన్​లోడ్​ : 2024 ఫిబ్రవరి 9 నుంచి 18 వరకు
  • పరీక్ష తేదీ : 2024 ఫిబ్రవరి 18

రైల్వేలో 5696 అసిస్టెంట్​ లోకో పైలట్ ఉద్యోగాలు - అప్లై చేయండిలా!

ఐటీఐ అర్హతతో 1646 రైల్వే ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.