Indias Rank In Having Multiple Sex Partners : భారత్కు చెందిన వ్యక్తి తన జీవితకాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాములను (సెక్సువల్ పార్ట్నర్స్) కలిగి ఉన్నట్లు లెక్కగడుతూ వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా తుర్కియే దేశానికి చెందిన వ్యక్తులు తమ జీవితకాలంలో సగటున 14.5 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారని అందులో పేర్కొంది. దాదాపు 46 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా, భారత్ అట్టడుగు స్థానంలో నిలిచింది.
'సాధారణంగా వివాహానికి ముందు సెక్స్ నుంచి దూరంగా ఉండటానికి సామాజిక లేదా సాంస్కృతిక ప్రాధాన్యాలు కారణమవుతాయి. భారత్లో చాలా మంది కఠినమైన వివాహ నియమాలను అనుసరిస్తారు. భారత్లో ఒక వ్యక్తి తన జీవితకాలంలో సగటున ముగ్గురు లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారు. హాంగ్కాంగ్, వియత్నాం, చైనాలో నివసించే వ్యక్తులు తమ జీవితకాలంలో నలుగురి కంటే తక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారు' అని డబ్ల్యూపీఆర్ తన నివేదికలో వివరించింది.
సాధారణంగా భారతీయ సమాజం ఒక వ్యక్తి తన జీవితంలో ఒకరి కంటే ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉండటానికి అనుమతించదని గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలోని సొసైటీ అండ్ డెవలప్‌మెంట్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ సుభాశ్ కుమార్ ఈటీవీ భారత్తో చెప్పారు. 'భారత్ లైంగిక భాగస్వాముల ర్యాంకింగ్లో అట్టడుగు స్థానంలో నిలవడం చాలా సానుకూల సంకేతంగా భావిస్తున్నాను. భారతీయ సాంస్కృతిక, సామాజిక నిబంధనలు చాలా ఉన్నత విలువలను కలిగి ఉంటాయి. భారతీయులకు అత్యంత విశ్వసనీయమైన జీవిత భాగస్వాములు ఉన్నారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఒకటి కంటే ఎక్కువ లైంగిక భాగస్వాములను కలిగి ఉండడం వల్ల వారు మానసిక, శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఆందోళన, నిరాశకు గురవుతారు. భారత్లో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది వివాహానికి ముందు లైంగిక సంబంధాలు పెట్టుకోరు. వారు ఒక లైంగిక భాగస్వామిని కలిగి ఉంటారు' అని ప్రొఫెసర్ సుభాశ్ తెలిపారు.
మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ర్యాకింగ్స్లో భారత్ అట్టడుగున నిలవడానికి భారతీయ విలువలు, సంస్కృతి ప్రధాన కారణమని నొయిడాలోని జేపీ ఆసుపత్రి క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక శ్రీవాస్తవ చెప్పారు. 'భారత్లో ఒక వ్యక్తి మరణించే వరకు ఒక జీవిత భాగస్వామిని కలిగి ఉంటాడు. వివాహాలు విచ్ఛిన్నమయ్యే సంఖ్య భారత్లో చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ఈ పరిస్థితి కొద్దికొద్దిగా మారుతోంది. మహిళలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు' అని శ్రీవాస్తవ చెప్పుకొచ్చారు.
నివేదికలోని ముఖ్యాంశాలు
చాలామంది వ్యక్తులు వారి జీవితకాలంలో బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు. తుర్కియే పౌరులు తమ జీవితకాలంలో సగటున 14.5 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు తేలింది. ఐస్‌లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తులు సగటున 13 కంటే ఎక్కువ మంది సెక్సువల్ పార్ట్నర్స్ను కలిగి ఉన్నారు. అమెరికా పౌరులు సగటున వారి జీవితకాలంలో 10 నుంచి 11 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు. అమెరికాలోని యువతీయువకులు సగటున 17 ఏళ్లకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నట్లు తేలింది.
ఉద్యోగులకు గుడ్ న్యూస్- EPF గరిష్ఠ వేతన పరిమితి పెంపు! - EPFO Maximum Salary Limit