ETV Bharat / bharat

'చిల్లర' సమస్యను తీర్చే మెషీన్​- ఫోన్‌తో స్కాన్ చేస్తే కాయిన్స్- ఎలా విత్​డ్రా చేయాలంటే? - QR BASED COIN VENDING MACHINE

దేశంలోనే తొలి 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' ప్రారంభం- చిల్లర సమస్యకు చెక్- యూపీఐతో ట్రాన్సాక్షన్ చేసి నాణేలు పొందే అవకాశం

First QR Based Coin Vending Machine in Kerala
First QR Based Coin Vending Machine in Kerala (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 4:43 PM IST

Updated : Oct 26, 2024, 5:29 PM IST

First QR Based Coin Vending Machine : దుకాణం లేదా మార్కెట్​కు వెళ్లి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు కొన్ని సార్లు చిల్లర సమస్య ఏర్పడుతుంది. దురాణదారుడి వద్ద చిల్లర లేకపోతే కస్టమర్లనే తీసుకురావాలని చెబుతుంటాడు. చిల్లర దొరకకపోవడం వల్ల కొన్ని సార్లు వాటిని కొనుగోలు చేయకుండానే తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సందర్భం దాదాపు అందరికి ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఉంటుంది. ఇలాంటి చిల్లర సమస్యలను అరికట్టేందుకు దేశంలోనే మొదటి 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్'ను కేరళలో ప్రారంభించారు. మరి అది ఎలా పని చేస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కోజీకోడ్​లోని పుతియారాలోని ఫెడరల్ బ్యాంకులో 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' ను ప్రారంభించారు. డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు ఏవిధంగానైతే ఉన్నాయో, అదే విధంగా కాయిన్స్ తీసుకునేందుకు క్యూఆర్ కోడ్ వెండింగ్ మెషీన్ ఉపయోగపడుతుంది. ఈ మెషీన్​లో స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేయడం వల్ల కావాల్సినన్ని నాణేలను తీసుకోవచ్చు. మీ యూపీఐ ద్వారా డబ్బును చెల్లించి నాణేలు పొందవచ్చు. ఈ మెషిన్​లో 1,2,5,10 రూపాయలు అందుబాటులో ఉంటాయి.

'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' అంటే ఏమిటి?
ఇది నగదు రహిత కాయిన్ డెలివరీ సిస్టమ్. ఈ మెషీన్లలో స్క్రీన్‌ పై ఉండే క్యూఆర్‌ కోడ్​ను స్కాన్‌ చేయడం ద్వారా కావాల్సిన నాణేలను పొందొచ్చు. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును చెల్లించి నాణేలు పొందొచ్చు. నాణేల కొరతను తగ్గించేందుకు ఈ మెషీన్ ఉపయోగపడుతుంది.

గతంలో కంటే భిన్నం
గతంలోనూ ఇలాంటి మెషీన్లు ఉన్నప్పటికీ, అవి నోట్లను స్వీకరించి మాత్రమే నాణేలను అందించేవి. కానీ క్యూఆర్ కోడ్ ఆధారిత వెండింగ్ మెషిన్​లో యూపీఐ చేసి నాణేలను ఈజీగా పొందొచ్చు. 2023లోనే క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్లను తీసుకురావాలని ఆర్​బీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో కోజీకోడ్​లోని ఫెడరల్ బ్యాంకులో దేశంలోనే 'క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్' ప్రారంభమైంది.

ఎలా పని చేస్తుందంటే?

  • ముందుగా క్యూఆర్ కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషీన్ వద్దకు వెళ్లి, అక్కడ స్క్రీన్ పై మీకు అవసరమైన చిల్లర మొత్తంపై క్లిక్ చెయ్యండి.
First QR Based Coin Vending Machine
మనకు కావాల్సిన కాయిన్​ను సెలక్ట్ చేసుకోవాలి (ETV Bharat)
  • మీకు ఏ నాణేం అవసరమో దానిపై క్లిక్ చెయ్యండి. ఈ మెషిన్​లో స్క్రీన్‌ పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ మీ యూపీఐతో స్కాన్‌ చేయండి.
First QR Based Coin Vending Machine
క్యూఆర్‌ కోడ్​ను స్కాన్​ చేయాలి (ETV Bharat)
  • ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత నాణేలు మెషిన్ నుంచి బయటకు వస్తాయి.
First QR Based Coin Vending Machine
మెషీన్​ నుంచి నాణేలు (ETV Bharat)

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపు యాప్​ల ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత వెండింగ్ మెషిన్​లో నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చు. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా ఈ మెషిన్​లో డబ్బులు తీసుకోవచ్చు. భారీ మొత్తంలో చిల్లర కావాలనుకునేవారిపై మాత్రం ఆంక్షలు విధించారు. దుకాణదారులు, బస్సు ప్రయాణికులు, విద్యార్థులు, కార్మికులకు ఈ మెషీన్లు ఎక్కువగా ఉపయోగపడే అవకాశం ఉంది.

Last Updated : Oct 26, 2024, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.