ETV Bharat / bharat

హసీనా విమానానికి రఫేల్‌తో బందోబస్తు - ఇండియా స్పెషల్ కేర్​! - Bangladesh Crisis

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 10:06 AM IST

India Security Sheikh Hasina Jet : బంగ్లాదేశ్‌లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె వస్తున్న విమానాన్ని భారత్‌ నిరంతరం పర్యవేక్షిస్తూ, రఫేల్ విమానాలతో రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది.

India Security Sheikh Hasina Jet
India Security Sheikh Hasina Jet (ANI)

India Security Sheikh Hasina Jet : బంగ్లాదేశ్‌లో గతకొన్ని రోజులుగా తలెత్తిన ఆందోళనకర పరిస్థితులను భారత్‌ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. సోమవారం అది తీవ్రరూపం దాల్చడం వల్ల ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో భారత్ మరింత అప్రమత్తమైంది. షేక్ హసీనా భారత్‌కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి.

రఫేల్ యుద్ధ విమానాలతో రక్షణ
భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్‌ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి. ఆ విమానంలో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఆ విమానానికి రక్షణ కల్పించేందుకు బంగాల్​లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్వ్కాడ్రన్‌లోని రఫేల్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బిహార్‌, ఝార్ఖండ్‌ మీదుగా అవి రక్షణ కల్పించాయి.

స్పెషల్ కేర్​
మరోవైపు ఉత్తర్​ప్రదేశ్​లోని హిండన్‌ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అందులో ఉన్న సిబ్బందితో భారత్‌ దళాలకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలన్నింటినీ భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి, పదాతిదళాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో భద్రతాదళాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు నిఘా విభాగాధిపతులు, జనరల్‌ ద్వివేది, ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ జాన్సన్‌ ఫిలిప్‌ మాథ్యూ కలిసి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

షేక్​ హసీనాతో చర్చలు జరిపిన అజిత్ డోభాల్
షేక్ హసీనా విమానం గాజియాబాద్​లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌లో సాయంత్రం 5:45 గంటలకు దిగింది. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ ఆహ్వానించారు. అక్కడే దాదాపు గంటసేపు చర్చలు జరిపి, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్‌ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి వెళ్లి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీకి పరిస్థితిని ఆయన వివరించారు. మరోవైపు బంగ్లాదేశ్ సంక్షోభం గురించి మంగళవారం ఉదయం దిల్లీలో అఖిలపక్ష భేటీని నిర్వహించనున్నారు. సమావేసం అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరాలను వెల్లడించనున్నారు.

బంగ్లాదేశ్​ పరిణామాలపై భారత్​ హైఅలర్ట్​- మోదీ నేతృత్వంలో కేబినెట్ మీటింగ్- హసీనాతో NSA భేటీ! - CCS Meeting

బంగ్లాదేశ్​ ప్రధాని ఇంట్లో లూటీ - ఫర్నీచర్‌ సహా చికెన్‌, కూరగాయలతో జంప్‌ - Bangladesh Violence

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.