India Alliance West Bengal TMC : ఇండియా కూటమికి బంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ఇచ్చారు. బంగాల్‌లో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. దేశంలోని ఇతర స్థానాల్లో సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నప్పటికీ, బంగాల్లోని 42 సీట్లలో మాత్రం ఒంటరిగానే బీజేపీని తాము ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాతే పాన్ ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. అయితే తాము ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నామని అన్నారు.
'కాంగ్రెస్ పార్టీతో నేను ఎలాంటి చర్చలు జరపలేదు. బంగాల్‌లో టీఎంసీ ఓ సెక్యులర్ పార్టీ. రాష్ట్రంలో ఒంటరిగానే బీజేపీని ఓడిస్తాం. వారికి మేం చాలా ప్రతిపాదనలు చేశాం. కానీ తొలి నుంచీ వారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అప్పుడే మేం ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సీట్ల పంపకాల విషయంలో తృణమూల్‌తో చర్చలు జరుగుతున్నట్లు రాహుల్ గాంధీ అసోంలో ప్రకటించిన వేళ దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితోనూ ఈ విషయంపై మాట్లాడలేదన్నారు. 300 స్థానాల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయాలని, మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తాయని అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ జోక్యాన్ని సహించబోమని తెలిపారు.
'రాహుల్ ప్రభావం ఉండదు'
ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రపై తమకు సమాచారం లేదని మమత తెలిపారు. బంగాల్ నుంచి రాహుల్ యాత్ర సాగుతున్నా సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆ యాత్ర వివరాలు తనకు తెలియజేసే మర్యాద ఆ పార్టీకి లేదా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రభావం పెద్దగా ఉండబోదన్నారు.
రాహుల్ యాత్రలో టీఎంసీ పాల్గొనే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి యాత్రకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని టీఎంసీ తెలిపింది. ఒకవేళ అందినా వెళ్లే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేసింది.
మమత మాకు ముఖ్యమే: కాంగ్రెస్
మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి స్పందించింది. మమతా బెనర్జీ లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేమని పేర్కొంది. కూటమికి టీఎంసీ మూలస్తంభం లాంటిదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ జోడో యాత్ర బంగాల్‌లోకి ప్రవేశిస్తుందని, సీట్ల పంపకానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.
-
#WATCH | Barpeta | On Mamata Banerjee's remark, Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "TMC is a pillar of the INDIA alliance. We cannot imagine the INDIA alliance without Mamata ji. Tomorrow our Yatra is entering West Bengal. Discussions… pic.twitter.com/QrR4XYIEKq
— ANI (@ANI) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Barpeta | On Mamata Banerjee's remark, Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "TMC is a pillar of the INDIA alliance. We cannot imagine the INDIA alliance without Mamata ji. Tomorrow our Yatra is entering West Bengal. Discussions… pic.twitter.com/QrR4XYIEKq
— ANI (@ANI) January 24, 2024#WATCH | Barpeta | On Mamata Banerjee's remark, Congress General Secretary in-charge Communications, Jairam Ramesh says, "TMC is a pillar of the INDIA alliance. We cannot imagine the INDIA alliance without Mamata ji. Tomorrow our Yatra is entering West Bengal. Discussions… pic.twitter.com/QrR4XYIEKq
— ANI (@ANI) January 24, 2024
'క్లిష్టమైన ప్రక్రియే, కానీ పరిష్కారం లభిస్తుంది'
రాష్ట్రస్థాయిలో ఒకరిపై ఒకరు పోరాటం చేసే టీఎంసీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య బంగాల్‌లో సీట్ల సర్దుబాటు కాస్త క్లిష్టమైన ప్రక్రియేనని దిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. అయితే, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగాల్‌లో టీఎంసీ పెద్ద పార్టీ అని పేర్కొన్న ఆయన- ఇండియా కూటమిని విజయతీరాలకు చేర్చేందుకు మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. కూటమిలోని అన్ని పార్టీలు ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
-
#WATCH | Delhi: On Mamata Banerjee's INDIA alliance remark, Delhi Minister Saurabh Bharadwaj says, "TMC is a big party in West Bengal, Congress and the Left has always been fighting against them. So seat sharing with TMC will be a little difficult. The issues between them will be… pic.twitter.com/caHzR2sLgZ
— ANI (@ANI) January 24, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi: On Mamata Banerjee's INDIA alliance remark, Delhi Minister Saurabh Bharadwaj says, "TMC is a big party in West Bengal, Congress and the Left has always been fighting against them. So seat sharing with TMC will be a little difficult. The issues between them will be… pic.twitter.com/caHzR2sLgZ
— ANI (@ANI) January 24, 2024#WATCH | Delhi: On Mamata Banerjee's INDIA alliance remark, Delhi Minister Saurabh Bharadwaj says, "TMC is a big party in West Bengal, Congress and the Left has always been fighting against them. So seat sharing with TMC will be a little difficult. The issues between them will be… pic.twitter.com/caHzR2sLgZ
— ANI (@ANI) January 24, 2024
'అది దీదీ స్ట్రాటజీ'
మమతా బెనర్జీ వ్యూహాత్మకంగానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ప్రతినిధి క్లైడ్ క్రాస్ట్రో అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమికి టీఎంసీ చాలా కీలకమని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని, బీజేపీపై గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.
దీదీ నిరాశకు నిదర్శనం: బీజేపీ
కాగా, మమత వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియా కూటమి లక్ష్యంగా విమర్శలు సంధించింది బీజేపీ. దీదీ వ్యాఖ్యలు ఆమె నిరాశను సూచిస్తోందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ అన్నారు. తన రాజకీయ ప్రాబల్యాన్ని నిలుపుకోలేక అన్ని సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించారని అన్నారు. విపక్ష కూటమి సారథిగా మారాలని భావించిన మమతకు, అక్కడ సముచిత స్థానం దక్కలేదని చెప్పారు. కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించే విషయంలో మమత పేరును ఎవరూ ప్రస్తావించలేదని ఆరోపించారు. జాతీయ స్థాయి నేతగా మారేందుకు అనేకసార్లు దిల్లీ పర్యటన చేసి వచ్చినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. తనను తాను కాపాడుకోవడంలో భాగంగా ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును ప్రతిపాదించి, కూటమి నుంచి బయటకు రావాలని దీదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ 22, భాజపా 18, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. సీపీఎంకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. ఓట్ల శాతం విషయానికి వస్తే తృణమూల్‌కు 43.3 శాతం, భాజపాకు 40.7 శాతం, సీపీఎంకు 6.33 శాతం, కాంగ్రెస్‌కు 5.67 శాతం ఓట్లు లభించాయి. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో పాటు సీపీఎం కూడా భాగంగా ఉన్నాయి. అయితే సీట్ల పంపకాల్లో భాగంగా బంగాల్‌లో ఉన్న 42 స్థానాల్లో తమకు 10 నుంచి 12 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మమతా మాత్రం 2 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తృణమూల్ వర్గాలు తెలిపాయి.
NDA vs INDIA in 2024 : బ్రహ్మాస్త్రంలా అయోధ్య- బీజేపీకి 400+ ఖాయమా?
NDA vs INDIA In 2024 : కాంగ్రెస్ సెల్ఫ్ గోల్! కూటమి గట్టెక్కేనా?