ETV Bharat / bharat

'లోక్​సభ డిప్యూటీ స్పీకర్ పదవి​ ప్రతిపక్షానికి ఇవ్వాల్సిందే'- అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్​ డిమాండ్​ - all party meeting today - ALL PARTY MEETING TODAY

All Party Meeting Today : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష భేటీలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడం సహా నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌పై చర్చ జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. దీనిపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, సభ సజావుగా సాగేలా చూడటం అధికార, ప్రతిపక్షాల ఉమ్మడి బాధ్యత అని తెలిపారు. నిబంధనల మేరకు ఏ అంశంపై అయినా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చేసిన సూచనలపై BAC సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు అఖిలపక్ష సమావేశం తర్వాత తెలిపారు.

all party meeting today
all party meeting today (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 1:00 PM IST

Updated : Jul 21, 2024, 4:57 PM IST

All Party Meeting Today : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి, లోక్‌సభలో బీజేపీ ఉపనేత రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన పార్లమెంటు అనెక్స్‌ భవనంలో ఈ భేటీ జరిగింది. 44పార్టీలకు చెందిన 55మంది నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ నేతలు గౌరవ్‌ గొగొయ్‌, జైరాం రమేశ్‌, కె.సురేశ్‌, MIMకు చెందిన అసదుద్దీన్‌ ఓవైసీ, ఆర్జేడీ ఎంపీ అభయ్‌ కుశ్వా, జేడీయూ నాయకుడు సంజయ్‌ ఝా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఎస్పీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌, ఎల్జేపీకి చెందిన చిరాగ్‌ పాసవాన్‌, ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్‌ పటేల్‌ తదితరులు అఖిల పక్ష భేటీకి హాజరయ్యారు.

గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయాన్ని ప్రస్తావించిన రాజ్‌నాథ్‌సింగ్‌, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని విపక్ష నేతలను కోరారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ఉప సభాపతి పదవి ప్రతిపక్షానికి కేటాయించాలని కోరిన కాంగ్రెస్‌ పార్టీ, నీట్‌ యూజీ పేపర్‌ సహా ప్రశ్నాపత్రాల లీక్‌ అంశంపై చర్చ జరగాలని ప్రభుత్వాన్ని కోరింది. కావడి యాత్ర సాగే మార్గంలో దుకాణాల బోర్డులపై యాజమానుల పేర్లు రాయాలన్న ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్‌ వివాదస్పద నిర్ణయాన్ని ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్‌ యాదవ్‌ అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు. అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, వివిధ పార్టీల నేతలు చేసిన సూచనలు, సలహాలను తగిన వేదికలపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

"అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నాం. కలిసికట్టుగా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలను నడిపిద్దామని చెప్పాం. పార్లమెంటు సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షాలపైనా ఉంది. ప్రతిపక్ష పార్టీల నేతలు చాలా సూచనలు చేశారు. వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌తో చర్చించి వాటిపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై పార్లమెంటరీ వ్యవహారాల సలహా సంఘం భేటీలో నిర్ణయం తీసుకుంటుంది."
--కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

బడ్జెట్​తోపాటు 6 బిల్లులు
ఈనెల 22వ తేదీ నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 23న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పించనున్నారు. పార్లమెంటు సమావేశాల మొదటిరోజే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు.

మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్‌
మరోవైపు పార్లమెంటు కార్యకలాపాలు హుందాగా, సజావుగా నిర్వహించుకునేందుకు సభ్యులు పాటించాల్సిన మార్గదర్శకాలపై రాజ్యసభ బులెటిన్‌ విడుదల చేసింది. సభాధ్యక్షుడి రూలింగ్స్‌ను సభ్యులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, పార్లమెంటు లోపల లేదా వెలుపల విమర్శించరాదని పేర్కొంది. సభలోపల వందేమాతరం, జైహింద్‌ వంటి నినాదాలు ఇవ్వరాదని, ప్లకార్డులూ ప్రదర్శించరాదని స్పష్టం చేసింది. ఎగువసభలోకి ప్రవేశించే సమయంతో పాటు సభ నుంచి నిష్క్రమించేటప్పుడు ప్రతి సభ్యుడు అధ్యక్ష స్థానానికి తలవంచి అభివాదం చేయాలంటూ సభ్యులకోసం రూపొందించిన హ్యాండ్‌ బుక్‌లోని నిబంధనలను మరోసారి గుర్తు చేసింది.

Last Updated : Jul 21, 2024, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.