ICG Seizes Drugs Worth Rs 600 Crore : గుజరాత్ పోర్‌బందర్‌కు పశ్చిమాన అరేబియా సముద్రంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ పడవలో డ్రగ్స్ తరలిస్తున్న 14 మంది పాకిస్థానీయులను భారత తీరరక్షక దళం-ICG అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ తరలింపుపై పక్కా సమాచారంతో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ -ATS, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో -NCB బృందాలతో ICG సంయుక్తంగా తనిఖీలు చేసింది. పాక్ పడవలో 600 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 86 కిలోల మాదకద్రవ్యాలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంది.
నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వారు ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వారిని చుట్టుముట్టిన అధికారులు 14 మంది పాకిస్థాన్ వ్యక్తులను చేశారు. ఈ ఆపరేషన్‌లో భారత తీరరక్షక దళానికి చెందిన రాజ్‌రతన్ నౌకను వినియోగించారు. మూడేళ్లలో ఇలాంటి 11 విజయవంతమైన ఆపరేషన్లు ఇండియన్ కోస్ట్ గార్డ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా చేపట్టాయని ఐసీజీ తెలిపింది.
ఇటీవల గుజరాత్, రాజస్థాన్‌లో రహస్యంగా నడుపుతున్న డ్రగ్ ల్యాబ్‌ల గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎస్సీబీ) రట్టు చేసింది. ఈ ప్రాంతంలోని మూడు తయారీ కేంద్రాల నుంచి సుమారు రూ.300 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే గుజరాత్ తీరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.
పాకిస్థాన్ కుట్ర భగ్నం
మార్చిలో కూడా ఇలాంటి భారీ ఆపరేషన్ చేపట్టింది ఇండియన్ కోస్ట్ గార్డ్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు సరఫరా చేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రల్ని భగ్నం చేసింది. NCB, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.480 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని పోరుబందర్ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ సరఫరాకు వీరు వినియోగించిన నౌక భారత్‌కు చెందినదిగా గుర్తించారు. దిల్లీ, పంజాబ్‌లకు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేసేందుకు నిందితులు యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
బంగ్లాదేశ్‌లో కుమార్తె- భారత్‌లో మరణించిన తండ్రి- BSF సాయంతో చివరిచూపు - BSF Helps Bangladeshi Girl