ETV Bharat / bharat

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేవారికి శుభవార్త! - టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం! - Hyderabad to Vijayawada Buses - HYDERABAD TO VIJAYAWADA BUSES

Hyderabad to Vijayawada Buses TSRTC : ఈ సమ్మర్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

Hyderabad to Vijayawada Buses TSRTC
Hyderabad to Vijayawada Buses TSRTC
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 10:43 AM IST

Hyderabad to Vijayawada TSRTC Buses : ఈ వేసవి కాలంలో విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు TSRTC ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతిరోజూ 120కి పైగా బస్సులు నడుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బస్సులలో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ బస్సులు 62 ఉన్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలియజేసింది. అలాగే ప్రయాణికులకు మరొక గుడ్‌న్యూస్‌ కూడా TSRTC చెప్పింది. అది ఏంటంటే.. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి టికెట్‌పై 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగు ప్రయాణానికి టికెట్ బుకింగ్‌ చేసుకుంటే కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని చెప్పింది. ప్రయాణికులు ఎవరైనా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ టికెట్లను బుకింగ్‌ చేసుకోవాలనుకుంటే.. అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని కోరింది.

బెంగళూరు వెళ్లే వారికీ గుడ్‌న్యూస్‌..
హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు కూడా టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ రూట్‌లో ప్రయాణించే వారు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తామని తెలిపింది. ఈ రాయితీ అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ వర్తిస్తుందని ప్రకటించింది. కాబట్టి, బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది.

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు..
దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఈ పుణ్యక్షేత్రానికి పండుగలు, వేసవి సెలవుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఈ వేసవి సెలవుల్లో భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక రాజధాని ఏసీ బస్సులను నడుపుతున్నామని TSRTC తెలిపింది. ఈ బస్సులు ప్రతి గంటకూ ఒకటి అందుబాటులో ఉంటాయని చెప్పింది. జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) నుంచి శ్రీశైలానికి ఒక్కరికి టికెట్‌ ధర రూ.524, అలాగే BHEL నుంచి రూ.564 టికెట్‌ ధర ఉందని తెలిపింది. ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా అత్యాధునిక హంగులతో రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించామని సంస్థ పేర్కొంది.

మా పాలనపై నమ్మకంతో చెబుతున్నా - 14 సీట్లు గెలుస్తాం : సీఎం రేవంత్ - CM REVANTH REDDY INTERVIEW LATEST

పెద్ద పులులకు నీటి కష్టాలు - దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ చర్యలు - WATER CRISIS FOR ANIMALS IN FOREST

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.