ETV Bharat / bharat

ఇండక్షన్‌ స్టౌ ఉపయోగిస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజర్​ తప్పదు! - How To Use Induction Stove

Induction Stove Usage Tips : ప్రస్తుతం ఇండక్షన్‌ స్టౌల వాడకం పెరిగిపోయింది. అయితే ఇవి వాడే క్రమంలో తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద ముప్పును తెచ్చిపెడతాయని నిపుణులు అంటున్నారు. అలాకాకుండా ఉండాలంటే స్టౌ ఉపయోగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 10:21 AM IST

Induction Stove
Induction Stove Usage Tips (ETV Bharat)

How To Use Induction Stove : నేటి కాలంలో ఇండక్షన్​ స్టౌల వాడకం పెరిగిపోయింది. పెరుగుతున్న గ్యాస్​ ధరల కారణంగా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా గ్యాస్ స్టవ్ కంటే ఇండక్షన్ ఉపయోగించడం చాలా ఈజీ. ఇండక్షన్‌ మీద వంటలు కూడా త్వరగా పూర్తవుతాయి. పైగా సమయం కూడా ఆదా అవుతుంది. అయితే, మామూలు గ్యాస్‌ స్టౌతో పోలిస్తే.. ఇండక్షన్ స్టౌ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల చాలాకాలం పాటు ఇండక్షన్ స్టౌ చక్కగా పని చేస్తుందని అంటున్నారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీ చూద్దాం..

గ్యాస్ స్టౌ పక్కన పెట్టకూడదు : కొంతమంది ఇండక్షన్ స్టౌని గ్యాస్ స్టౌ పక్కన పెడుతుంటారు. అయితే ఇలా పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఎప్పుడైనా గ్యాస్‌ లీకైతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు. కాబట్టి, కిచెన్‌లోనే వేరేచోట ఇండక్షన్ స్టౌని పెట్టాలని సూచిస్తున్నారు.

తుప్పు, జిడ్డు మరకలతో ట్యాప్స్​ అసహ్యంగా ఉన్నాయా? - ఇలా చేస్తే కొత్తవాటిలా మెరిసిపోతాయి!

మెటల్ టేబుల్ పైన పెట్టకండి: ఇండక్షన్ స్టౌ కరెంట్‌తో పని చేస్తుంది కాబట్టి దీనిని మెటల్ టేబుల్ పైన పెట్టకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇలా పెట్టడం వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి దీనిని వీలైనంత వరకు చెక్క టేబుల్​పై పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే సెరామిక్ టైల్స్, సిమెంట్ ఫ్లోర్ పైన కూడా పెట్టుకోవచ్చంటున్నారు.

ఇలా క్లీన్ చేయండి : సాధారణంగా మనం గ్యాస్‌ స్టౌను సోప్‌, నీళ్లను ఉపయోగించి శుభ్రం చేస్తుంటాం. కానీ, ఇండక్షన్‌ స్టౌని ఇలా క్లీన్ చేస్తే పాడవుతుందని.. అలాంటి సమయంలో దీనిని నీటిని ఉపయోగించకుండా మెత్తని వస్త్రంతో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

సెట్టింగ్స్‌ సెట్‌ చేసుకోండి : ఇండక్షన్ స్టౌలు చాలా వేగంగా వేడవుతాయి. కాబట్టి మీరు వంటే చేసే ముందే సెట్టింగ్స్‌ను సెట్‌ చేసుకోండి. లేకపోతే వంట పాడైపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ఇవే కాకుండా..

  • ఇండక్షన్ స్టౌలపై స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా కాస్ట్ ఐరన్‌తో చేసిన వంట పాత్రలను ఉపయోగించండి. అలాగే ప్యాన్‌ ఫ్లాట్‌ బాటమ్ కలిగి ఉండేలా చూసుకోండి.
  • అలాగే దీనిని రేడియోలు, టీవీలు, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది.
  • ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్స్‌టెన్షన్ ప్లగ్ బాక్సులకు.. ఇండక్షన్ స్టౌ ప్లగ్‌ని అనుసంధానించకూడదు.
  • అలాగే స్టౌకి ఉన్న రంధ్రాల్లో దుమ్ము, ధూళి చేరకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
  • ఇండక్షన్‌ స్టౌకి ఏమైనా పగుళ్లు వచ్చినట్లు గుర్తిస్తే.. దానిని ఉపయోగించకూడదు.
  • ఇంకా స్టౌ దగ్గర్లో ఎలాంటి లోహ సామగ్రిని ఉంచకూడదు.

మీ లివర్ ప్రమాదంలో పడిందా? - ఈ ఫుడ్స్ తినండి - వెంటనే క్లీన్ అవుతుంది!

చపాతీ Vs అన్నం - ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా? - పరిశోధనలో తేలింది ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.