ETV Bharat / bharat

పునుగులు + టమాటా చట్నీ డెడ్లీ కాంబినేషన్ - ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసేయండి! - how to prepare punugulu at home

How To Prepare Punugulu At Home In Telugu : సాయంత్రం అయ్యిందంటే చాలు.. పునుగుల బండ్ల వద్ద జనాలు గుమిగూడుతారు. ఇష్టమైన పునుగులను.. టమాటా చట్నీతో ఆస్వాదిస్తుంటారు. కానీ ఇంట్లో తయారు చేసుకుంటే.. అంత టేస్టీగా ఉండవు. మరి.. స్ట్రీట్​ సైడ్​ టేస్ట్​ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు తెలుసా?

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 2:06 PM IST

How To Prepare Punugulu At Home In Telugu
పునుగులు+ టమాట చట్నీ టేస్ట్ అదుర్స్​ కదా (ETV Bharat)

How To Prepare Punugulu At Home in Telugu : సాయంత్రం సమయం.. వేడి వేడి పునుగులు.. టమాటా చట్నీ.. ఆహాఁ! చెబుతుంటూనే నోరూరుతోంది కదా! అట్లుంటది మరి టేస్ట్​!! ఇవి అందరికీ ఎంతో ఇష్టమైన ఈవెనింగ్​ స్నాక్​. అయితే.. కొన్నిసార్లు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇంట్లోనే పునుగులు చేసుకుందాం అనుకుంటారు చాలామంది. కానీ.. రోడ్డు పక్కన​ దొరికే బండ్లపైన ఉండే టేస్ట్​ రాలేదని ఫీలవుతుంటారు. అయితే.. ఇలా చేస్తే స్ట్రీట్​ సైడ్​ దొరికే పునుగుల లాగానే సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పునుగుల కోసం కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు మైదా పిండి
  • ఒక కప్పు పుల్లటి పెరుగు
  • పచ్చిమిర్చీ
  • ఒక టీ స్పూన్​ జీలకర్ర
  • రుచికి సరిపడా ఉప్పు

చట్నీ కోసం కావాల్సిన పదార్థాలు

  • నూనె
  • ఒక టీ స్పూన్​ వేరుశనగ (పల్లీలు)
  • ఒక టీ స్పూన్ దనియాలు
  • ఎండు మిర్చీలు
  • టమటాలు
  • కొత్తిమీర
  • వెల్లుల్లి ముక్కలు

పునుగుల తయారీ విధానం

  • ముందుగా గిన్నెలో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి.
  • మనం ఎంత మైదాపిండి తీసుకుంటామో అంతే మోతాదులో పుల్లటి పెరుగు వేయాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చీ, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోండి.
  • పులిసిన పెరుగు వేస్తే మళ్లీ వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సోడా వేస్తే నూనెను ఎక్కువ పీల్చుకుంటుంది.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. (పుల్లటి పెరుగు కాకపోతే ఇంకా రెండు గంటలు ఎక్కువే నానబెట్టాలి)
  • ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే, బాగా పులిసిన దోశ పిండి ఉన్నా వేసుకోవచ్చు.
  • గంటపాటు పిండిని నానబెట్టుకున్న తర్వాత స్టౌ ఆన్​ చేసుకుని ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.
  • నూనె బాగా వేడయ్యాక చిన్నచిన్నగా పునుగులు వేసుకోని ఫ్రై చేయాలి.
  • పునుగులు వేసేటప్పడు మంటను మీడియం ఫ్లేమ్​లోకి మార్చండి.
  • ఆ తర్వాత హై ఫ్లేమ్​లోకి మార్చి పునుగులు క్రిస్పీగా అయ్యేవరకు ఫ్రై చేయండి.

చట్నీ తయారీ విధానం

  • స్టౌపైన ఒక పాన్​ పెట్టి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్​ నూనె పోయాలి.
  • ఆ తర్వాత వేరుశనగ, దనియాలు, కారానికి సరిపడా ఎండు మిర్చీ వేసి ఫ్రై చేయండి.
  • ఇవన్నీ వేగాక కట్ చేసిన టమాట ముక్కలను వేసి లో ఫ్లేమ్​లో మగ్గనివ్వాలి.
  • టమాటాలు మెత్తగా అవ్వగానే స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి.
  • అనంతరం వీటన్నింటిని మిక్సీ జార్​లోకి వేసి కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్​ చేసుకోవాలి.
  • అవసరాన్ని బట్టి కొద్దిగా నీటిని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దానిలో తాలింపు వేసుకుంటే సూపర్ టమటా చట్నీ రెడీ!

హోటల్ స్టైల్ 'మైసూర్ బోండా' - ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే అద్దిరిపోతుంది! - Mysore Bonda Recipe

ప్రెషర్​ కుక్కర్​లో చికెన్​ బిర్యానీ - పిల్లలు కూడా ఈజీగా వండేస్తారు! - Chicken Biryani Recipe In Cooker

ఈ దోసెలు తింటే రుచికి రుచి.. బరువూ తగ్గుతారు - వెయిట్​లాస్​ కావాలనుకునేవారికి అద్భుత అవకాశం! - Oats Dosa Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.