ETV Bharat / bharat

స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అదిరిపోతుంది! - How to Make Orange Barfi

How to Make Orange Barfi : స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండీ! అందులో డెజర్ట్స్ అంటే ఇంకెంతో ఇష్టంగా తింటుంటారు చాలా మంది. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన స్వీట్ డెజర్ట్ తీసుకొచ్చాం. అదే.. నాగ్​పుర్ స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Barfi
Orange Barfi
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 10:09 AM IST

How to Make Orange Barfi at Home : మనలో చాలా మంది స్వీట్స్(Sweets) అంటే ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఎప్పుడైనా పార్టీస్ లేదా ఫంక్షన్స్​కు వెళ్లినప్పుడు ఎక్కువ మంది భోజనం తర్వాత ఏదైనా ఒక టేస్టీ డెజర్ట్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసం అదిరిపోయే ఒక స్వీట్ ఎండ్ టేస్టీ డెజర్ట్ తీసుకొచ్చాం. అదే.. నాగపుర్ ఫేమస్ ఆరెంజ్ బర్ఫీ. దీనిని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఈ ఆరెంజ్​ బర్ఫీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు! మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి నాగ్​పుర్ ఫేమస్ ఆరెంజ్​ బర్ఫీని ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • నారింజ గుజ్జు(పల్ప్) - 750 గ్రాములు
  • చక్కెర - 50 గ్రాములు
  • ఎండిన కొబ్బరి - 100 గ్రాములు
  • ఆరెంజ్ ఫుడ్ కలర్
  • మిల్క్ సాలీడ్స్ లేదా కోవా - 250 గ్రాములు
  • కొద్దిగా సిల్వర్ వర్క్(ఫినిషింగ్ టచ్​ కోసం)

ప్రపంచంలో నెంబర్-2 బెస్ట్ స్వీట్​గా మన రసమలై - ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి!

ఆరెంజ్ బర్ఫీ తయారీ విధానం :

  • మీరు ఆరెంజ్ బర్ఫీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నారింజ పండ్ల తొక్కను తీయాలి. ఆ తర్వాత అందులోని గింజలు, పైన తోలును తొలగించి గుజ్జును(పల్ప్​) మాత్రమే ఒక బౌల్​లోకి తీసుకోవాలి. అలా మీరు ఎంచుకున్న అన్ని నారింజ పండ్ల గుజ్జును తీసి పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్​ పెట్టి అందులో మీరు శుభ్రంగా తీసి పెట్టుకున్న నారింజ గుజ్జును వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఆపై పంచదారను యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. మీ ఇష్టాన్ని బట్టి అది ఉడుకుతున్న టైమ్​లో ఆరెంజ్ ఫుడ్ కలర్​ వేసుకోవచ్చు.
  • ఇప్పుడు అలా ఉడుకుతున్న మిశ్రమంలో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపటికి ఆ మిశ్రమంలో కోవాను యాడ్ చేసుకొని అన్ని పదార్థాలు బాగా మిక్స్ అయ్యేలా గరిటెతో కలుపుతూ.. సరైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మిశ్రమంలో ఉండలు ఏర్పడకుండా బాగా కలుపుతూ ఉండాలి.
  • ఆ తర్వాత పూర్తిగా ఉడికిన మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ట్రే తీసుకొని అందులోకి వేసుకోవాలి. అందులో ఆ మిశ్రమాన్ని అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని సిల్వర్ వర్క్​తో టాప్ చేసి కనీసం 3 నుంచి 4 గంటలపాటు ఆ మిశ్రమాన్ని సెట్ అవ్వనివ్వాలి.
  • చివరిగా ట్రేలో దాన్ని సరిగ్గా సెట్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీకు కావాల్సిన షేప్​, సైజ్​లో కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో టేస్టీ టేస్టీ నాగ్​పుర్ ఫేమస్ ఆరెంజ్ బర్ఫీ రెడీ!

ఆరెంజ్ బర్ఫీ ఆరోగ్య ప్రయోజనాలు :

  • నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తాజా నారింజలతో ప్రిపేర్​ చేసుకున్న ఆరెంజ్ బర్ఫీ సహజ చక్కెరలు, ఫైబర్‌లను కలిగి ఉంటుంది. ఫలితంగా.. నెమ్మదిగా శక్తి విడుదల అవుతుందని, రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.
  • విటమిన్ సితో నిండిన నారింజ బర్ఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. అంతేకాకుండా, ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
  • అలాగే.. తాజా నారింజలు డైటరీ ఫైబర్‌ను అందిస్తాయని, జీర్ణక్రియకు సహాయపడతాయంటున్నారు నిపుణులు. అయితే, ఇక చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. అన్ని స్వీట్ల మాదిరిగానే దీన్ని మితంగా తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

రంజాన్ స్పెషల్ "రైస్ ఖీర్ పుడ్డింగ్" - ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా! - Rice Kheer Pudding Recipe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.