How To Make Egg Pulao Recipe : చాలా మంది అమ్మలు స్కూల్‌కు వెళ్లే పిల్లల కోసం.. "ఈ రోజు లంచ్ బాక్స్‌లో ఏం పెట్టాలి" అని ఆలోచిస్తుంటారు. కారణం.. లంచ్ బాక్స్‌లో రెగ్యులర్‌గా కర్రీ, రైస్ పెడితే.. అది ఎంత టేస్టీగా ఉన్నా కూడా.. తినకుండా సగం బాక్స్‌ను ఇంటికే తీసుకొస్తారు. దీంతో తమ పిల్లలు ఏమీ తినడం లేదని తల్లులు బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో ఒక్కసారి ఎగ్ పులావ్ చేసి పెట్టండి.. "మమ్మీ మా బాక్స్ ఖాళీ" అంటూ తీసుకొస్తారు. అయితే ఇది కేవలం పిల్లలకే కాదు.. ఆఫీస్‌కు వెళ్లే వారు కూడా తీసుకెళ్లొచ్చు. మరి పిల్లలు మెచ్చే.. పెద్దలు నచ్చే ఎగ్ పులావ్‌ను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఎగ్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి బియ్యం- కప్పు (250 గ్రాములు)
- ఉల్లిపాయలు- రెండు
- పచ్చిమిర్చి - 4 ( సన్నగా కట్ చేసుకోవాలి)
- ఉడికించిన గుడ్లు-6
- ఉప్పు సరిపడినంత
- ఆయిల్- రెండు టేబుల్ స్పూన్‌లు
- షాజీరా- టేబుల్ స్పూన్
- బిరియానీ ఆకులు -2
- యాలకులు-5
- లవంగాలు-5
- అల్లం వెల్లులి పేస్ట్- 1 టేబుల్ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి- సగం టేబుల్ స్పూన్
- కారం- సరిపడా
- పసుపు- చిటికెడు
- గరం మసాలా పొడి - అర టేబుల్ స్పూన్
- కొత్తిమీర, పుదీనా- కొద్దిగా
అద్దిరిపోయే టమాటా రసం నిమిషాల్లో సిద్ధం - అన్నంలోకే కాదు సూప్‌లా తాగేయొచ్చు!
టేస్టీ ఎగ్ పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
- బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు బాస్మతీ బియ్యం ప్లేస్‌లో సన్నబియ్యం కూడా వాడుకోవచ్చు.
- బియ్యం నానిన తర్వాత స్టౌ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టి అన్నం ఉడికేందుకు సరిపడా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి నీరు మరిగించుకోవాలి.
- నీరు మరుగుతున్నప్పుడు.. బియ్యం వేసి అన్నం పూర్తిగా ఉడికించకుండా.. ఒక 90 శాతం ఉడికించి గంజి ఒంపి రైస్‌ను ఓ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయండి (ఇక్కడ మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు). తర్వాత అందులో షాజీరా, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు వేయండి.
- ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి.
- ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు(అన్నంలో ఉప్పు వేశారు కాబట్టి.. చూసి వేసుకోండి), గరం మసాలా అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి.
- తర్వాత ఇందులో ఉడికించిన ఎగ్స్ వేసి అవి వేగేంతవరకు కలుపుకోవాలి.
- ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న రైస్‌ను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా చల్లుకుంటే సరిపోతుంది.
- ఒక్కసారి ఇంట్లో ఈ ఎగ్ పులావ్‌ను రెడీ చేసి పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టారంటే.. ఒక్క మెతుకు మిగలకుండా తింటారు.
- నచ్చితే మీరు కూడా ఈ ఎగ్ పులావ్‌ను ఇంట్లో ప్రిపేర్ చేయండి.
హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్!
సండే స్పెషల్: ట్రెండింగ్ 'నెల్లూరు చేపల పులుసు' - ఎలా చేయాలో మీకు తెలుసా?