Carrot Ginger Soup Making : వర్షం పడిందా.. వేడివేడిగా ఏదైనా తినాలని, ఏదైనా సూప్‌లు తాగాలని ఉంటుంది. ఇక సూప్‌లు అనగానే అవి చేయడం కష్టమని చాలా మంది అనుకుంటారు. వాటి కోసం ఏవేవో పదార్థాలుండాని వాటిని చేయడానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెస్ట్ సూప్‌ని మీ కోసం తీసుకొచ్చాం. అదే క్యారెట్, అల్లం సూప్. చాలా త్వరగా రెడీ అయ్యే ఈ సూప్‌ని పిల్లలతో పాటు పెద్దలు కూడా.. ఎంతో ఇష్టంగా తాగొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూప్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానాన్ని ఓ సారి చూసేయండి!
కావాల్సిన పదార్ధాలు :
- మిరియాలు- అర టేబుల్‌స్పూన్
- అల్లం ముక్క - చిన్నది
- వెల్లులి రెబ్బలు- 5
- క్యారెట్- పావు కేజీ
- నీళ్లు- అర లీటర్‌కు పైనే
- బిర్యానీ ఆకు-ఒకటి
- ఉప్పు- రుచికి సరిపడా
- నూనె- టేబుల్‌స్పూన్
- ఉల్లిపాయ- ఒకటి
క్యారెట్, అల్లం సూప్ తయారు చేయు విధానం :
- ముందుగా స్టౌ ఆన్ చేసి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి కొద్ది సేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మరొసారి వేపండి.
- తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసి బాగా కలపండి. ఆ తర్వాత అర లీటర్ నీళ్లు పోసుకుని మూత పెట్టి.. సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
- క్యారెట్ బాగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా ఫ్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి.
- తర్వాత గ్రైండ్ చేసుకున్న జ్యూస్‌ని స్టెయినర్‌లో పోసుకుని వడకట్టుకోండి. అలాగే గ్లాసు నీళ్లను పోసుకుని గరిటే సహాయంతో ప్రెస్ చేస్తూ సూప్ వచ్చేలా వడకట్టుకోండి.
- చిక్కగా వచ్చిన సూప్‌ని సన్నని మంటమీద పెట్టి.. ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి.
- సూప్ మరగుతున్నప్పుడు వచ్చిన నురగను గరిటే సహాయంతో తీసేయండి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దింపేసుకుంటే.. వేడివేడి క్యారెట్, అల్లం సూప్ రెడీ.
- అంతే చాలా సింపుల్‌గా దీనిని చేసుకోవచ్చు. నచ్చితే మీరు ఈ వర్షాకాలంలో ఈ సూప్ ట్రై చేయండి!
ఇవి కూడా చదవండి :