ETV Bharat / bharat

మీరు కొనేది నిజమైన పట్టు చీరేనా? ఫేక్ చీరనా? - ఇలా గుర్తించండి! - Tips To Identify Pure Silk Saree

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 29, 2024, 5:10 PM IST

How To Find Pure Silk Saree : ప్రతి మహిళకు ఇంట్లో శుభకార్యాలప్పుడూ, పండుగల సమయంలో అందమైన పట్టు చీరలు కట్టుకోవాలని ఉంటుంది. అందుకే బీరువాలో ఎన్ని చీరలున్నా కూడా.. తరచుగా షాపింగ్​ చేస్తుంటారు. అయితే, ఎక్కువ మందికి ఒరిజినల్​ పట్టు చీరలను ఎలా గుర్తించాలో తెలియదు. దీనివల్ల కొన్నిసార్లు నకిలీ పట్టు చీరలు కొని మోసపోతుంటారు. ప్యూర్​ పట్టు చీరలను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

Pure Silk Saree
How To Find Pure Silk Saree (ETV Bharat)

How To Identify Pure Silk Saree : బంధువుల ఇంట్లో ఏ చిన్న శుభకార్యానికి వెళ్తున్నా, ఇంట్లో ఏదైనా పండుగ చేస్తున్నా మహిళలు ఖరీదైన పట్టు చీరలను కడుతుంటారు. ఇక ఇంట్లో ఎవరి పెళ్లైనా ఉందంటే చాలు.. షాపింగ్​ మాల్స్​ తిరిగి ఖరీదైన, అందమైన పట్టు చీరలను కొంటుంటారు. మంచి డిజైన్ ఉన్న​ పట్టు చీరల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే, చాలా మంది మహిళలకు అసలైన పట్టు చీరలకు, నకిలీ వాటికి తేడా తెలియదు! దీనివల్ల కొన్నిసార్లు నకిలీ పట్టు చీరలు కొని.. రెండు మూడుసార్లు కట్టుకున్న తర్వాత.. చీర వెలవెలబోతే బాధపడుతుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే, షాపింగ్​ మాల్స్​ లేదా షాప్స్​లో పట్టు చీరలను కొనుగోలు చేసేటప్పుడే జాగ్రత్తగా కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని టిప్స్​ పాటించి ప్యూర్​ పట్టు చీరలు, నకిలీ వాటికి మధ్య తేడాను ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.

కాల్చడం ద్వారా :
పట్టు చీరకున్న ఒక పోగుని తీసి కాల్చడం ద్వారా సింపుల్​గా అది ఒరిజినల్​ లేదా నకిలీదా అని గుర్తించవచ్చు. ఆ పోగు బాగా దగ్గరికి చేసి లైటర్​తో కాల్చండి. ఇలా ఒరిజినల్​ పట్టుని కాల్చినప్పుడు.. దారం జుట్టు కాలిన వాసన వస్తుంది. ఈ మంట త్వరగా ఆరిపోతుంది. అలాగే పట్టు బూడిదగా మారిపోతుంది. అదే మీరు సింథటిక్​ చీర పోగును కాల్చితే మంట తగలగానే ప్లాస్టిక్​లా కాలుతుంది.

తక్కువ ధరకే వస్తున్నాయంటే ఆలోచించండి!
ప్యూర్​ పట్టు చీరలు తయారు చేయడానికి నేత కార్మికులు చాలా శ్రమపడతారు. అలాగే ఇవి తయారు కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, సాధారణంగానే ఒరిజినల్​ పట్టు చీరలు కాస్త ఎక్కువ ధర ఉంటాయి. ఎవరైనా తక్కువ ధరకే పట్టు చీరలు అమ్ముతున్నామంటే.. కాస్త ఆలోచించి ముందడుగు వేయండి.

వాటర్​ డ్రాప్స్ ​:
అసలైన పట్టు చీరలపై రెండు మూడు నీటి చుక్కలను వేస్తే.. నీరుని నెమ్మదిగా చీర పీల్చుకుంటుంది. అదే నకిలీ పట్టు చీరలైతే త్వరగా నీరు జారిపోతుంది. మీరు ఇంట్లో ఉన్న పట్టు చీరలపై కొన్ని చుక్కల నీళ్లను పోసి టెస్ట్​ చేసుకోవచ్చు.

ఉంగరంతో :
ఒరిజినల్​ పట్టు చీర కొన పట్టుకుని ఉంగరంలోకి దూర్చి ఎంత లాగినా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. అదే సింథటిక్​ చీరలు ఉంగరం మధ్యలోనే ఆగిపోతాయి. ఈ ట్రిక్​ను మీరు షాపింగ్​ మాల్​లో టెస్ట్​ చేసి మంచి పట్టు చీరను కొనుగోలు చేయవచ్చు.

మెరుస్తాయి :
ప్యూర్​ పట్టు చీరలు లైట్​ కింద పెట్టినప్పుడు గోల్డెన్​ కలర్​లో ధగధగా మెరిసిపోతాయి. అయితే, నకిలీ పట్టువి లైట్​ వెలుతురులో ఉంచినప్పుడు అంతగా ప్రకాశవంతంగా కనిపించవు.

  • నకిలీ పట్టు చీరలు లైట్​ పెట్టి చూస్తే పలుచగా కనిపిస్తాయి. అదే ప్యూర్​ పట్టు చీరలు లైట్​ వెలుతురులో కూడా మందంగా ఉన్నట్లు కనిపిస్తాయి.
  • అలాగే ప్యూర్​ పట్టు చీరలు చాలా మృదువుగా ఉంటాయి. వాటిని తాకినప్పుడు మెత్తగా ఉంటుంది. అయితే, సింథటిక్​ చీరలు కాస్త రఫ్​గా ఉంటాయని గుర్తుంచుకోండి.
  • ప్యూర్​ పట్టు చీరలపైన ఉండే జరీ వర్క్​ గోల్డెన్​ కలర్​లో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే జరీ వర్క్ బిగుతుగా చీరను పట్టుకుని ఉంటుంది. నకిలీ పట్టు చీరల జరీ వర్క్​ అంతగా మెరవదు. అలాగే జరీ వర్క్​ వదులుగా, పోగులుగా తేలి కనిపిస్తుంది.
  • ఈ టిప్స్​ పాటిస్తే.. దాదాపు మీరు ప్యూర్​ పట్టు చీరలను ఈజీగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

అలర్ట్​: పట్టు చీరలను ఎండలో ఆరేస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!

కంచి చీరలు ఎందుకు అంత ఫేమస్​ - మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.