How To Complaint on IRCTC : రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మందికి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటి గురించి ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి ఫిర్యాదును నమోదు చేయడానికి రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్‌ను (Railway Toll Free Number for Complaint) ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చు. అయితే, ఈ ఫిర్యాదు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలా ఫిర్యాదు చేయాలి?
రైలు ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను పరిష్కరించేందుకు భారత రైల్వే శాఖ 'రైల్ మదద్' పేరుతో (Where to Complaint Against IRCTC) హెల్ప్ లైన్ నంబర్ 139ను ప్రారంభించింది. సమస్యలన్నింటికీ ఒకే హెల్ప్ లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ వ్యవస్థను రూపొందించింది. దీనికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడమే కాకుండా ఎస్ఎమ్ఎస్ పంపే సదుపాయం కూడా ఉంది. భద్రత, వైద్య అత్యవసర పరిస్థితులు, రైలు ప్రమాదాలు, ఏదైనా ఇతర రైలు సంబంధిత, సాధారణ ఫిర్యాదులతో పాటు విజిలెన్స్ వంటి వాటిపైనా ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వొచ్చు. దీంతో పాటు ఫిర్యాదు చేసిన అంశంపై స్టేటస్ తెలుసుకునే సదుపాయం కూడా ఉంది.
పాత హెల్ప్ లైన్స్ పరిస్థితి ఏంటి?
గతంలో రైల్వే కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ హెల్ప్ లైన్స్‌ను నిలిపివేసినట్లు కేంద్ర రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. గతంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 182ను 2021, ఏప్రిల్ 1 నుంచి నిలిపివేసి, 139 నంబర్లో విలీనం చేసినట్లు తెలిపింది. ఈ కొత్త హెల్ప్ లైన్ నంబర్ మొత్తం 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రయాణికులు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ఆధారంగా ఫిర్యాదు చేయాలి (How to File Complaint Against IRCTC). లేదా స్టార్ బటన్ నొక్కి నేరుగా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో కనెక్ట్ అవొచ్చు.
హెల్ప్ లైన్ నంబర్ కింద సహాయం ఎలా పొందాలి?
- భద్రత, అత్యవసర వైద్య సేవల కోసం 1 నొక్కాలి. ఇది నేరుగా ఎగ్జిక్యూటివ్ కాల్ సెంటర్‌కు కనెక్ట్ అవుతుంది.
- రైలు ఎంక్వైరీల కోసం బటన్ 2 నొక్కాలి. ఇందులో సబ్ మెనూలో పీఎన్ఆర్ స్టేటస్, రైలు రాకపోకల సమాచారంతో పాటు, ఛార్జీల విచారణ, టిక్కెట్ బుకింగ్, రద్దు, వేకప్ అలారం, గమ్యస్థాన హెచ్చరిక, వీల్ చైర్ బుకింగ్, భోజనం బుకింగ్ వంటి వాటి కోసం సబ్ మెనూలో ఉన్న 2 బటన్ వినియోగించాలి.
- సాధారణ ఫిర్యాదుల కోసం ప్రయాణికులు 4 నంబర్ నొక్కాలి.
- విజిలెన్స్ సంబంధిత సమస్యల కోసం 5 నొక్కాలి.
- పార్శిల్, వస్తువులకు సంబంధించిన అంశాల కోసం 6 నొక్కాలి.
- IRCTC ఆధ్వర్యంలో నడిచే రైళ్ల వివరాల కోసం 7 నొక్కాలి.
- ఫిర్యాదులపై స్టేటస్ తెలుసుకునేందుకు ప్రయాణికులు 9 నొక్కాలి.
- కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడేందుకు స్టార్ (*) బటన్ నొక్కాలి.
TRAIN ఫుల్ ఫామ్ తెలుసా? ఆ పదం ఏ భాష నుంచి వచ్చింది?
టికెట్ బుకింగ్‌కు ఈమెయిల్, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ మస్ట్!- IRCTC కొత్త అప్డేట్