How to Clean Washing Machine with Vinegar : ఈ రోజుల్లో ఇంట్లో వాషింగ్ మెషిన్ కామన్. అయితే.. చాలా మంది దాంట్లో బట్టలు వేసి వాష్ చేసుకోవడం తప్ప, అది క్లీన్‌గా ఉందో లేదో పెద్దగా పట్టించుకోరు. ఫలితంగా.. అది త్వరగా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. మీరు వాషింగ్ మెషిన్(Washing Machine) యూజ్ చేస్తున్నట్లయితే ఈ టిప్స్ పాటిస్తూ శుభ్రం చేసుకోండి. మీ మెషిన్ కొత్తదానిలా మెరవడమే కాదు ఎక్కువకాలం మన్నికగా ఉంటుందని చెబుతున్నారు. ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మీరు ముందుగా వాషింగ్ మెషిన్లో హాచ్ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాషర్లో 945 ml(అంటే సుమారు 4 కప్పులు) వెనిగర్ వేసుకోవాలి.
- వాషింగ్ మెషిన్‌ను డీప్ క్లీన్ చేయాలనుకుంటే దానికి 1 కప్పు బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో బట్టలేవీ వేయకుండా మెషీన్ డోర్ క్లోజ్ చేసి 5 నిమిషాల పాటు రన్ చేయాలి.
- ఇలా ఐదు నిమిషాలు రన్ చేసిన తర్వాత మెషీన్ ఆఫ్ చేసి గంట పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల లోపల పేరుకున్న మురికి మొత్తం వదులుతుంది.
- వాటర్ డ్రైన్ అయిన తర్వాత వాషింగ్ మెషిన్ డోర్ ఓపెన్ చేసి శుభ్రమైన గుడ్డతో లోపల డ్రమ్ శుభ్రం చేసుకోవాలి.
- అదే ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషిన్ అయితే.. డోర్ వద్ద ఆగిన వాటర్‌ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి కాసేపు అలా వదిలేయాలి. దాంతో లోపల తడిపోయి పొడిగా మారుతుంది.
- ఇక మెషిన్ బయట భాగాన్ని క్లీన్ చేయడానికి ఒక శుభ్రమైన క్లాత్, సిట్రస్ క్లీనర్ యూజ్ చేయండి. ముందుగా క్లీనర్‌తో స్ప్రే చేసి తర్వాత క్లాత్‌తో జాగ్రత్తగా తుడవండి. దాంతో మెషీన్ బయట ఉన్న మురికి పోతుంది.
ఫిల్టర్ క్లీనింగ్ : చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఫిల్టర్ శుభ్రం చేయడం మర్చిపోతారు. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మెషిన్ దిగువ ముందుభాగంలో ఉండే చిన్న తలుపే ఈ పంపు ఫిల్టర్. ఇది వెచ్చని, తేమతో కూడి ఉంటుంది. కనుక, దీనిలో పురుగులు ఎక్కువ జమ అవుతాయి. దీనిని ఎప్పటికప్పుడు ఖాళీగా ఉంచుతూ లోపలి చెత్త తీసేయాలి. లేదంటే వాటర్ సరిగ్గా పోక లీక్‌లకు దారి తీస్తుంది.
డిటర్జెంట్ బాక్స్ : మెషిన్లో ఉండే డిటర్జెంట్ బాక్స్ కూడా వాషింగ్ పౌడర్, పురుగులతో పేరుకుపోయి మురికిగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. సాధ్యమైతే, మొత్తం బాక్స్‌ను బయటకు తీసి, ఒక పాత టూత్ బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి.
80 సెకన్లలో దుస్తులుతికే మిషిన్.. సర్ఫ్, నీరు అవసరం లేకుండానే..!
మరికొన్ని వాషింగ్ మెషిన్ జాగ్రత్తలు :
- గోడకు దగ్గరగా వాషింగ్ మెషిన్‌ను పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మెషిన్ వెనక ఉండే పైపులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
- తరచుగా మెషిన్ పైపులు చెక్ చేస్తుండాలి. ఫలితంగా లీకేజీ ఉంటే త్వరగా గుర్తించవచ్చు.
- వాషింగ్ మెషిన్లకు పౌడర్లు కాకుండా.. లిక్విడ్ డిటర్జెంట్లు వాడటం మంచిది. ఎందుకంటే పౌడర్లు వాడటం వల్ల అవి మెషిన్లో పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. లిక్విడ్ సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి డ్రమ్‌లో ఇరుక్కుపోయి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉండదు.
- మెషిన్లో బట్టలు ఉతికిన తర్వాత కాసేపు డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దాంతో లోపల తేమ పోయి డ్రైగా అవుతుంది.
- ఫలితంగా బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. అలాగే బట్టలు ఉతకడం పూర్తి అయిన తర్వాత వాషింగ్ మిషన్‌ను పొడి క్లాత్‌తో శుభ్రం చేయండి.
- వాషింగ్ మెషిన్ లోపల డ్రమ్ శుభ్రంగా మెరుస్తూ కనపడినా.. దీనిలో ఉన్న రంధ్రాలలో పురుగులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి నెలలో రెండుసార్లు దీనిని ఖాళీగా ఉంచి వాష్ రన్ చేయటం మంచిది అంటున్నారు నిపుణులు.
నీరు, సర్ఫ్ అక్కర్లేని వాషింగ్ మెషీన్.. ఎలా పని చేస్తుందంటే?