Himachal Pradesh Floods : హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల కారణంగా ముగ్గురు మరణించారు. 40 మంది గల్లంతయ్యారు. శిమ్లా, మండి జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో అనేక ఇళ్లు కొట్టుకుపోగా, రెండు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం అయ్యాయి.
A building collapsed and was washed away in raging Parvati River in Kullu, earlier today.#HimachalPradesh #Kullu pic.twitter.com/4InDhr8Dhc
— Ƭɴ Thiru ࿐திருலோகசந்தர் (@R_ThiruChandar) August 1, 2024
నిద్రపోతుండగా ముంచెత్తిన వరద
శిమ్లా జిల్లా రామ్‌పుర్ సబ్డివిజల్ పరిధిలోని సమాఘ్ ఖుద్లో బుధవారం అర్ధరాత్రి 1 గంటకు ఒక్కసారిగా వరద ఉప్పొంగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 28 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని శిమ్లా జిల్లా పోలీస్ సూపరిండెంటెంట్ సంజీవ్ కుమార్ గాంధీ వెల్లడించారు. వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కాపాడినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎప్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నట్లు వివరించారు. అయితే, ఆకస్మిక వరదల కారణంగా ఆ ప్రాంతంలో అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు వంతెనలు కొట్టుకుపోయాయి. ఫలితంగా సహాయక బృందాలు చేరుకునేందుకు ఇబ్బంది ఎదురవుతోంది.
#WATCH | Himachal Pradesh | The SDRF team at the spot in Shimla for the search and rescue operation where 36 people are missing and 2 bodies have been recovered so far after a cloudburst in the Samej Khad of Rampur area in Shimla district.
— ANI (@ANI) August 1, 2024
(Visual source - DPRO Shimla) pic.twitter.com/hVfkTFdYeR
మండి జిల్లాలో వరద
మండి జిల్లా పదర్లోని తాలాటుఖోద్ ప్రాంతంలోనూ ఆకస్మిక వరద సంభవించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించారు. 9 మంది గల్లంతయ్యారు. కొన్ని ఇళ్లు కుప్పకూలగా, రోడ్లు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రంగాం- వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరింది.
#WATCH | Himachal Pradesh | 19 people are missing after a cloudburst in the Samej Khad of Rampur area in Shimla district. The SDRF team at the spot for the search and rescue operation
— ANI (@ANI) August 1, 2024
(Visual source - DPRO Shimla) pic.twitter.com/afz23ylf4P
మరోవైపు, హిమాచల్ ప్రదేశ్వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగడం వల్ల అనేక చోట్ల చండీగఢ్-మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. కుల్లూలోని భాగీపుల్లో ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుల్లూలోని పార్వతి నది, మలానా ఖుద్ ఉగ్రరూపం దాల్చాయి. ఫలితంగా మలానా-1, మలానా-2 జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి.
#WATCH | Himachal Pradesh: The water level in Beas River has increased due to heavy rains in the region; latest aerial visuals from the region pic.twitter.com/FI26AQIope
— ANI (@ANI) August 1, 2024
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్
వరుణుడి బీభత్సం నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై సమీక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎంతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.
దిల్లీలో వరుణుడి బీభత్సం - ఇద్దరు మృతి - వర్షంలోనే సివిల్స్ అభ్యర్థుల నిరసనలు - Delhi Rains
కేరళ విషాదంలో 287 మృత్యువాత - వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక గాంధి - Wayanad Landslide