ETV Bharat / bharat

భార్యాపిల్లల పోషణార్థంపై హైకోర్టు కీలక తీర్పు- భర్త ఆస్తి జప్తు చేయాలని ఆదేశాలు! - Husband And Wife Issue In Highcourt - HUSBAND AND WIFE ISSUE IN HIGHCOURT

High Court Order On Husband Wife Issue : విడాకుల తీసుకున్న ఓ మహిళకు, ఆమె దివ్యాంగ కుమారుడికి పోషణార్థం నెలవారీ ఇచ్చే డబ్బుల విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. మహిళకు, ఆమె కుమారుడికి పోషణార్థం నెలకు ఒక్కొక్కరికి రూ.5వేలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే మహిళ భర్త ఆస్తిని జప్తు చేయాలని ఆదేశించింది.

High Court Order On Husband Wife Issue
High Court Order On Husband Wife Issue (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 4:57 PM IST

High Court Order On Husband Wife Issue : విడాకులు తీసుకున్న భార్య, దివ్యాంగ కుమారుడికి నెలవారీ పోషణార్థం డబ్బులు ఇవ్వని వ్యక్తి ఆస్తిని జప్తు చేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. మహిళకు, ఆమె కుమారుడికి ఆమె భర్త నెలవారీ భరణం చెల్లించని క్రమంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మహిళ భర్తపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది జస్టిస్ అను శివరామన్, జస్టిస్ అనంత్ రామనాథ్ హెగ్డేలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం. విచారణ సందర్భంగా 2012 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మహిళకు, ఆమె కుమారుడికి నెలకు రూ.5000 చొప్పున పోషణార్థం డబ్బులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.

బెంగళూరులోని ఉత్తరాహల్లిలో మహిళ భర్తకు ఉన్న 1,276 చదరపు అడుగుల ఇల్లును జప్తు చేయాలని ఆదేశించింది. భర్త ఇతర ఆస్తి వివరాలు మహిళ అందిస్తే వాటిని కూడా జప్తు చేస్తామని పేర్కొంది. గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మహిళ భర్త పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే ఆస్తి బదిలీ చట్టం 1882 లోని సెక్షన్ 39 ప్రకారం భర్త ఆస్తిలో కొంత భాగాన్ని మహిళ, ఆమె కుమారుడికి వస్తుందని పేర్కొంది.

ఇదీ కేసు
2002లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది ఓ మహిళ. అప్పటికే ఆమెకు ఓ దివ్యాంగ కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆమె తనకు, కుమారుడికి నెలకు కొంతమేర నగదును పోషణార్థం ఇవ్వమని కోరింది. దీంతో మహిళ భర్త ఆమెకు నెలకు రూ.2వేలు, దివ్యాంగ కుమారుడికి రూ.1000 ఇచ్చాడు. ఆమె మళ్లీ పదేళ్ల తర్వాత(2012) ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు పోషణార్థం ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్ ఫ్యామిలీ కోర్టు ఒక్కొక్కరికి నెలకు రూ.3వేలు ఇవ్వాలని ఆదేశించింది. ఆ తర్వాత పోషణార్థం ఇచ్చే నగదును పెంచాలని, పాత బకాయిలు చెల్లించలేదని మహిళ కర్ణాటక హైకోర్టులో కొన్నాళ్ల క్రితం పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన హైకోర్టు, మహిళ, ఆమె దివ్యాంగ కుమారుడికి పోషణార్థం నెలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఇవ్వాలని ఆదేశించింది.

'ఆ హక్కును కోల్పోరు'
భార్య మరణించిన తర్వాత రెండో వివాహం చేసుకున్న వ్యక్తి మొదటి భార్య పిల్లల సంరక్షక హక్కును కోల్పోరని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో అశోక్ పాఠక్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. మౌ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోమని పేర్కొంది.

పిటిషన్​లో వివరాలు ప్రకారం
భార్య మరణించడం వల్ల రెండో పెళ్లి చేసుకున్నారు ఓ వ్యక్తి. అయితే మొదటి భార్య ఇద్దరు పిల్లలను తనకు అప్పగించమని మౌ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కోర్టు తన అల్లుడు రెండో పెళ్లి చేసుకున్నాడా లేదా అన్నది నిరూపించాల్సిన బాధ్యత పిటిషనర్‌ దేనని కోర్టు తీర్పునిచ్చింది.

దీంతో తన కుమార్తె చనిపోయాక అల్లుడు మరో వివాహం చేసుకున్నాడని మహిళ తండ్రి అశోక్ పాఠక్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కుమార్తె వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత తన కూతురు మరణించిందని, అప్పటి నుంచి ఆమె పిల్లలు తన వద్దే ఉంటున్నారని తెలిపారు. పిల్లల సంరక్షణ బాధ్యత తన అల్లుడికి అప్పగించవద్దని పిటిషన్​లో కోరారు. అందుకు పిటిషన్​ను కోర్టు తిరస్కరించింది.

మాలీవాల్ దాడి కేసులో సీఎం PA బిభవ్ కుమార్ అరెస్ట్- వైద్య నివేదికలో కీలక విషయాలు! - Swati Maliwal Assault Case

కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ టీమ్- స్వాతితో సీన్​ రీకన్​స్ట్రక్షన్- బీజేపీ కుట్ర అంటూ ఆప్​ ఎదురుదాడి - Swati Maliwal Issue

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.