Hemant Soren ED : భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తనపై జరిపిన ఈడీ విచారణను కుట్రగా అభివర్ణించారు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్. ఈడీ తనపై కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈడీ దాడులకు తాను భయపడననని తన నివాసం వెలుపల ఉన్న మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 'నాపై కుట్ర జరిగింది. అయితే కుట్రదారుల శవపేటికకు చివరి మేకు మేమే వేస్తాము. నేను భయపడను. మీ నాయకుడు మొదట బుల్లెట్లను ఎదుర్కొంటాడు. మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతాడు. మీ అచంచలమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వెన్నుదన్నుగా నిలుస్తా' అని హేమంత్ సోరెన్ తెలిపారు.
-
#WATCH | Ranchi | Jharkhand CM Hemant Soren says, "They are hatching conspiracies...We are doing the state's development by shredding their conspiracies to pieces...It is time to put a final nail in their coffin...Don't worry...I will be grateful to you. Hemant Soren will always… pic.twitter.com/EYcePZyyHu
— ANI (@ANI) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Ranchi | Jharkhand CM Hemant Soren says, "They are hatching conspiracies...We are doing the state's development by shredding their conspiracies to pieces...It is time to put a final nail in their coffin...Don't worry...I will be grateful to you. Hemant Soren will always… pic.twitter.com/EYcePZyyHu
— ANI (@ANI) January 20, 2024#WATCH | Ranchi | Jharkhand CM Hemant Soren says, "They are hatching conspiracies...We are doing the state's development by shredding their conspiracies to pieces...It is time to put a final nail in their coffin...Don't worry...I will be grateful to you. Hemant Soren will always… pic.twitter.com/EYcePZyyHu
— ANI (@ANI) January 20, 2024
-
#WATCH | Jharkhand CM Hemant Soren greets people outside his residence in Ranchi. He was questioned by the ED in a land scam case for more than 7 hours today. pic.twitter.com/4Bno6mBu95
— ANI (@ANI) January 20, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Jharkhand CM Hemant Soren greets people outside his residence in Ranchi. He was questioned by the ED in a land scam case for more than 7 hours today. pic.twitter.com/4Bno6mBu95
— ANI (@ANI) January 20, 2024#WATCH | Jharkhand CM Hemant Soren greets people outside his residence in Ranchi. He was questioned by the ED in a land scam case for more than 7 hours today. pic.twitter.com/4Bno6mBu95
— ANI (@ANI) January 20, 2024
అంతకుముందు భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్-ED అధికారులు శనివారం ప్రశ్నించారు. ఆదివారం మరోసారి హేమంత్ సోరెన్‌ను విచారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు సోరెన్ అధికార నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులకు 7గంటలకు పైగా ప్రశ్నించారు. ఈడీ అధికారులు సోరెన్ ఇంటి నుంచి వెళ్లిపోయిన అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇటీవల బంగాల్‌లో ఈడీ అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో వారికి CISF రక్షణ కల్పించారు. సోరెన్ నివాసం చుట్టూ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు వీలుగా CISF బృందాలు హై-రిజల్యుషన్ బాడీ కెమెరాలు వినియోగించాయి. విల్లు, బాణాలు పట్టుకొని JMM శ్రేణులు తరలిరావటం వల్ల సీఎం నివాసానికి వంద మీటర్ల దూరంలో పోలీసులు వారిని నిలిపివేశారు. అధికార ఝార్ఖండ్ ముక్తి మోర్చా-JMMకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు గతంలో ఏడుసార్లు నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరు కాలేదు. ఎనిమిదోసారి సమన్లు ఇవ్వటం వల్ల విచారణకు అంగీకరించారు.
కాగా రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సోరెన్‌ను గతేడాది నవంబరులో ఈడీ 9 గంటల పాటు విచారించింది. ఆ తర్వాత భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటివరకు ఈ కేసులో 14 మంది అరెస్టవగా, వారిలో ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్ కూడా ఉన్నారు.