Hathras Stampede Tragedy : ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటన వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. కొన్ని వందల మందికి కన్నీటిని మిగిల్చింది. తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి 16 ఏళ్ల కుమార్తె, తల్లి, భార్యను కోల్పోయి ఒంటరి జీవిగా మిగిలిపోయాడు. కుటుంబం మొత్తాన్ని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. తాను సర్వం కోల్పోయానని వాపోతున్నాడు.
"నా భార్య, కుమార్తె, తల్లి సత్సంగ్‌కు వెళ్లినట్లు నాకు మొదట తెలియదు. నేను పనిమీద బయటకు వెళ్లాను. సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగిందని వేరే వాళ్లు నాకు చెప్పారు. అప్పుడు వెంటనే నేను ఘటనాస్థలికి వెళ్లాను. అక్కడ నా 16 ఏళ్ల కుమార్తె, తల్లి, భార్య విగతజీవులుగా పడి ఉన్నారు. నా తల్లి మృతదేహాన్ని ఇంకా గుర్తించలేకపోయాను" అని వినోద్ వాపోయారు.
VIDEO | A tragedy struck devotees at a 'Satsang' in Hathras yesterday. A total of 121 devotees died in the stampede during the 'Satsang'. Devasted family members mourn the loss. pic.twitter.com/2gDspxMFq3
— Press Trust of India (@PTI_News) July 3, 2024
భర్త వద్దని చెప్పినా వినని భార్య- ఆఖరికి మృత్యు ఒడికి
తన భార్యను భోలే బాబా సత్సంగ్‌కు వెళ్లకుండా ఆపాలని చాలా సార్లు ప్రయత్నించానని, కానీ ఆమె వినలేదని వాపోయాడు మెహతాబ్. పొరుగింటి మహిళలతో కలిసి సత్సంగ్‌కు వెళ్లిన తన భార్య గుడియా దేవీ మృతి చెందిందని విలపించాడు. తన కుమార్తె క్షేమంగానే ఉందని తెలిపాడు.
#WATCH | Hathras stampede | Husband of the deceased Gudiya Devi, Mehtab says, " i tried to stop her from attending the baba's satsang many times but she did not listen. she had come for the satsang with our daughter & two neighbouring women. the two neighbouring women and my wife… pic.twitter.com/XZCU2mzTs4
— ANI (@ANI) July 2, 2024
కోడలు మృతి- మనవడి కోసం పడిగాపులు
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో మరణించిన తన కోడలు రూబీ మృతదేహం వద్ద రాజ్‌కుమారి దేవీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పేదలకు మాత్రమే జరుగుతాయని, ధనికులకు కాదని వాపోయారు. తన మనవడి ఆచూకీ కోసం రాజ్ కుమారి దేవీ ఆందోళన చెందుతున్నారు. తనతో పాటు 60 మంది బస్సులో హాథ్రస్‌కు వచ్చారని ఆమె తెలిపారు.
VIDEO | #HathrasStampede: An elderly woman, Urmila Devi, searching for her granddaughter at Etah Hospital, recalls what happened at the incident site.
— Press Trust of India (@PTI_News) July 3, 2024
" as soon as the 'satsang' concluded, people started to rush outside. there was a huge crowd. i have been searching for my… pic.twitter.com/Va6lvZ00vZ
ఇంటికి వెళ్లే సమయంలో తొక్కిసలాట
మరోవైపు, సత్సంగ్‌ను ముగించుకుని మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో భక్తులంతా ఇంటికి వెళ్లే సమయంలో ఈ తొక్కిసలాట జరిగిందని, జనమంతా ఒకరిపై ఒకరు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షి శకుంతలా దేవి తెలిపారు. అలాగే సత్సంగ్ ముగిసిన వెంటనే ఒక్కసారిగా ప్రజలు బయటికి రావడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాట జరిగిందని మరో ప్రత్యక్ష సాక్షి ఊర్మిలా దేవి పేర్కొన్నారు.
VIDEO | #HathrasStampede: An elderly woman, Urmila Devi, searching for her granddaughter at Etah Hospital, recalls what happened at the incident site.
— Press Trust of India (@PTI_News) July 3, 2024
" as soon as the 'satsang' concluded, people started to rush outside. there was a huge crowd. i have been searching for my… pic.twitter.com/Va6lvZ00vZ
'ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు'
ఇలాంటి ఘటన జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని హాథ్రస్ తొక్కిసలాటలో చనిపోయిన 3ఏళ్ల చిన్నారి తండ్రి సత్యేంద్ర యాదవ్ విలపించారు. దిల్లీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతడు మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి సత్సంగ్‌లో హాజరయ్యాడు. మధ్యాహ్నం జరిగిన తొక్కిసలాటలో 3 ఏళ్ల చిన్నారిని కోల్పోయాడు.
భోలే బాబాపై ఎఫ్ఐఆర్కు డిమాండ్
మరోవైపు, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో భోలే బాబా పేరు లేకపోవడంపై తొక్కిసలాటలో మరణించవారి కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భోలే బాబా వల్లే ప్రజలు సత్సంగ్‌కు భారీగా తరలివచ్చారని, ఆయనను ప్రధాన నిందితుడిగా పరిగణించాలని స్థానికుడు బాబురావు డిమాండ్ చేశారు.
VIDEO | #HathrasStampede: Family members of those who died in the incident express their dissatisfaction over Baba Narayan Hari, who is also known as Saakar Vishwa Hari Bhole Baba, not being named in the FIR.
— Press Trust of India (@PTI_News) July 3, 2024
" people don't follow the 'sewadars', people came because of baba.… pic.twitter.com/b1BOWxiy5l
ప్రాణాలు కోల్పోవడానికి అదే కారణం!
హథ్రస్ తొక్కిసలాటలో చాలా మంది ఊపిరి ఆడకపోవడం వల్ల మరణించారని ఎటా జిల్లా ఆస్పత్రి సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. తొక్కిసలాట తర్వాత ఆస్పత్రిలో సాధారణ రోజులతో పోలిస్తే శవపరీక్షలు నాలుగు రెట్లు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు.
ఆగస్టులో 'నీట్-పీజీ'ఎగ్జామ్- పరీక్షకు 2గంటల ముందే ప్రశ్నపత్రం తయారీ!