ETV Bharat / bharat

హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్- అధిక్యంలో కాంగ్రెస్

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 4 minutes ago

Haryana Election Results 2024 Live Updates
Haryana Election Results 2024 Live Updates (ETV Bharat)

Haryana Election Results 2024 Live Updates : హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 67.9 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్ మధ్య పోటి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్‌ ఫిగర్ 46 సీట్లు రావాలి. కాగా, హ్యాట్రిక్‌ విజయం తమదేనని బీజేపీ నేతల ధీమా వ్యక్తం చేసింది. గెలుపు ఖాయమని కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది. అయితే హరియాణాలో కాంగ్రెస్‌దే గెలుపని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

LIVE FEED

9:35 AM, 8 Oct 2024 (IST)

అధిక్యంలో కాంగ్రెస్

  • కాంగ్రెస్+ 40 స్థానాల్లో ముందంజ
  • బీజేపీ 34 స్థానాల్లోలీడ్, ఇతరులు 6
  • లాడ్వా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నాయబ్​ సింగ్ సైనీ ముందంజ

9:22 AM, 8 Oct 2024 (IST)

బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ- చండీగఢ్​కు ఏఐసీసీ పరిశీలకులు

  • 33 స్థానాల్లో కాంగ్రెస్+ ముందంజ
  • 32 స్థానాల్లో బీజేపీ లీడ్, ఇతరులు 6
  • జులానా నుంచి రెజ్లర్‌ వినేష్‌ ఫొగాట్‌ (కాంగ్రెస్‌) ముందంజ
  • చండీగఢ్​కు బయలుదేరిన హరియాణా ఏఐసీసీ పరిశీలకులు అజయ్​ మాకెన్, అశోక్​ గెహ్లోత్​, ప్రతాప్​ సింగ్ భజ్వా

8:41 AM, 8 Oct 2024 (IST)

హరియాణాలో 17చోట్ల కాంగ్రెస్‌, 14చోట్ల బీజేపీ బీజేపీ లీడ్

  • కొనసాగుతున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్
  • హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్ 46
  • హరియాణాలో 17చోట్ల కాంగ్రెస్‌, 14చోట్ల బీజేపీ ముందంజ

8:03 AM, 8 Oct 2024 (IST)

లెక్కింపు ప్రారంభం

మొదట పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు లెక్కించనున్నట్లు హరియాణా చీఫ్​ ఎలక్టోరల్ అధికారి పంకజ్ అగర్వాల్​ తెలిపారు. అనంతరం ఈవీఎమ్​లలో నిక్షిప్తమైన ఓట్లను కౌంట్​ చేయనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 93 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

6:59 AM, 8 Oct 2024 (IST)

కౌంటింగ్​ కేంద్రం వద్దకు ముఖ్యమంత్రి నాయబ్​ సింగ్ సైనీ

హరియాణా ముఖ్యమంత్రి, లాడ్వా నియోజకం వర్గం బీజేపీ అభ్యర్థి నాయబ్​ సింగ్ సైనీ కురుక్షేత్రంలోని సైనీ సమాజ్​ ధర్మశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైనీ, తమకు ఎలాంటి కూటమి అవసరం లేదన్నారు. బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

Last Updated : 4 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.