ETV Bharat / bharat

హ్యాపీ ఫ్రెండ్​షిప్ డే దోస్త్ - మీ ప్రియనేస్తానికి ఇలా విషెస్ చెప్పండి - దిల్​ ఖుష్ అవ్వడం పక్కా! - Happy Friendship Day 2024 - HAPPY FRIENDSHIP DAY 2024

Happy Friendship Day 2024 : సినిమాకు వెళ్దామన్నా వాడే.. షికారుకెళ్లినా వాడే.. నైట్ పార్టీకెళ్లినా వాడే.. నైట్ ఔట్​లు చేసినా వాడే! ఇలా స్నేహితుడి గురించి ఎంత చెప్పుకుంటూ పోయినా తక్కువే. అందుకే.. అలాంటి స్నేహుతుడిని 'ఫ్రెండ్‌షిప్ డే -2024' సందర్భంగా ఈ స్పెషల్ విషెస్​, కోట్స్​తో సందేశాలు పంపి సర్​ఫ్రైజ్ చేయండి..!

Happy Friendship Day 2024
Friendship Day 2024 Wishes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 11:01 AM IST

Friendship Day 2024 Wishes And Quotes : మన కష్టాన్ని.. మన సుఖాన్ని.. షేర్​ చేసుకుంటూ.. బతుకంతా వెన్నంటే ఉంటారు స్నేహితులు. అందుకే.. "స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల" అన్నాడో రచయిత. అలాంటి వెలుగును సెలబ్రేట్​ చేసుకునే రోజే.. ఈ "ఫ్రెండ్​షిప్ డే"(Friendship Day 2024). ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు జాతీయ స్నేహితుల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారు. మరి.. ఈ ఫ్రెండ్​షిప్ డే సందర్భంగా మీ దోస్తులకు విషెస్ చెప్పడానికి 'ఈటీవీ - భారత్' చక్కటి ఫ్రెండ్​షిప్ డే విషెస్, కోట్స్ తీసుకొచ్చింది. ఇందులో మీకు నచ్చినదాన్ని మీ ఫ్రెండ్స్​కు షేర్ చేయండి.

  • "అందరూ కనిపించే నా చిరునవ్వు మాత్రమే చూస్తారు. నువ్వు మాత్రం గుండెల్లో దాగిఉన్న బాధను చూస్తావు" హ్యాపీ ఫ్రెండ్​షిప్ డే దోస్త్!
  • "అద్దం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏడిస్తే.. అది ఎన్నటికీ నవ్వదు. నువ్వు నా అద్దం రా" హ్యాపీ ఫ్రెండ్​షిప్ డే మేరీ జాన్
  • "ఫ్రెండ్​షిప్ అంటే.. ఆనందాలు పంచుకోవడమే కాదు, అవసరాల్లోనూ తోడూనీడగా నిలవాలి. నీకు నేనున్నాననే భరోసా కలిగించాలి. అదే నిజమైన స్నేహం"- స్నేహితుల రోజు శుభాకాంక్షలు!
  • "నేస్తమా అని పలకరించే మంచి హృదయం నీకుంటే.. నీ నేస్తానికి చిరకాలం నేను తోడుంటా మిత్రమా"- హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే దోస్త్!
  • "నీవు గాయపడితే సానుభూతి తెలిపేవారు చాలామంది ఉంటారు. కానీ, ఒక్క స్నేహితుడు మాత్రమే.. ఆ గాయాన్ని మరిచిపోయేలా చేస్తాడు!" - హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే
  • "నీ కథలన్నీ తెలిసినోడు... మంచి మిత్రుడు. కానీ, ప్రతి కథలో నీతోపాటు ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!"- స్నేహితుల రోజు శుభాకాంక్షలు మిత్రమా!
  • "ఫ్రెండ్‌షిప్ అంటే సంతోషంగా ఉన్నప్పుడు మన వెంట తిరగడం కాదు.. నీకు ఎన్ని కష్టాలొచ్చినా నీ వెంట నేనున్నాని భుజం తట్టి చెప్పేవాడే అసలైన దోస్త్"- స్నేహితుల రోజు శుభాకాంక్షలు!!
  • "నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అవసరాన్ని, బాధల్లో ఉన్నప్పుడు మనసుని తెలుసుకుని హెల్ప్ చేసేవాడ్ నిజమైన మిత్రుడు"- హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే
  • "వంద మంది స్నేహితులు ఉండటం గొప్పకాదు.. వంద సమస్యలు తీర్చే నిజమైన ఒక్క మిత్రుడిని కలిగి ఉండటం గొప్ప"- హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మేరా దోస్త్!

స్నేహానికి సరికొత్త భాష్యం చెప్పిన సినిమాలు ఇవే!

Friendship Day 2024 Special Quotes in Telugu :

"మదిలోని మంచితనానికి మరణం లేదు..

ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు..

అనుక్షణం తపించే స్నేహానికి అవధులు లేవు.."

- హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే!!

"నువ్వు లేకపోతే నేను లేను అనేది 'లవ్'..

నువ్వుండాలి నీతోపాటు నేనుండాలి అనేది 'ఫ్రెండ్‌షిప్' "

- హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మిత్రమా!

"అమ్మ ఇచ్చేది.. జన్మ

దేవుడు ఇచ్చేది.. బుద్ధి

గురువు ఇచ్చేది.. విద్య

ఎవరూ ఇవ్వకుండా దొరికేది.. స్నేహం"

-హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే దోస్త్!

"స్నేహం.. ఒక సుందర స్వప్నం

నీ పరిచయం.. ఒక సుందరకావ్యం

ఎన్ని జన్మలలోనైనా.. ఈ స్నేహబంధం

ఇలాగే ఉండాలని కోరుకుంటోంది నా హృదయం"

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మిత్రమా!!

FRIENDSHIP DAY : ఒంటరైనా... ఓటమైనా వెంట ఫ్రెండే!

TRUE FRIEND: ఎన్ని మాటలు పడినా మీతో దోస్తీ వదలనిది "వాడే.."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.