ETV Bharat / bharat

నర్సుపై గ్యాంగ్​రేప్ అటెంప్ట్- డాక్టర్ ప్రైవేట్ పార్టులను కోసేసిన బాధితురాలు - Gang Rape Attempt On Nurse - GANG RAPE ATTEMPT ON NURSE

Gang Rape Attempt On Nurse : ఆస్పత్రిలో విధుల్లో ఉన్న నర్సుపై ఓ డాక్టర్‌తోపాటు ఇద్దరు సహాయకులు సామూహిక అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే ఘటన నుంచి తప్పించుకున్న బాధితురాలు, బ్లేడ్​తో వైద్యుడి జననాంగాలను కోసేసింది. బిహార్​లోని సమస్తిపుర్​లో జరిగిందీ ఘటన.

Gang Rape Attempt On Nurse
Gang Rape Attempt On Nurse (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 6:53 AM IST

Gang Rape Attempt On Nurse : కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ, బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది. అయితే బాధితురాలు చాకచాక్యంగా వ్యవహరించి ఘటన నుంచి తప్పించుకుంది. అక్కడే తాను పనిచేస్తున్న క్లినిక్​లో ఉన్న బ్లేడ్​తో డాక్టర్ జననాంగాలను కోసేసింది. ఘటనాస్థలి నుంచి బయటకొచ్చి పోలీసులకు సమాచారం అందించింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, సమస్తిపుర్‌ జిల్లాలోని ముశ్రీఘరారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆర్‌బీఎస్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ హెల్త్ కేర్ సెంటర్​లో పనిచేస్తున్న బాధితురాలు, బుధవారం రాత్రి విధుల్లో నిమగ్నమై ఉంది. ఆ సమయంలో డాక్టర్‌, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌ అయిన సంజయ్‌ కుమార్‌ మరో ఇద్దరు సహాయకులతో కలిసి ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు పదునైన బ్లేడ్‌తో డాక్టర్‌ జననాంగాలను కోసేసింది.

అనంతరం అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి పోలీసులకు 112కు కాల్ చేసి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. ఘటన జరిగిన సమయంలో డాక్టర్‌, ఇతర నిందితులు మద్యం మత్తులో ఉన్నారని తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌తో పాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీస్​ స్టేషన్​కు తరలించారు. అనంతరం ఘటనకు సంబంధించి డీఎస్పీ సంజయ్‌ కుమార్‌ పాండే వివరాలను వెల్లడించారు.

తమకు సమాచారం అందిన వెంటనే ఆస్పత్రికి పోలీసులు వెళ్లారని చెప్పారు. డాక్టర్‌తో పాటు మిగతా ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అత్యాచార యత్నానికి ముందు నిందితులు ఆసుపత్రికి ప్రధాన ద్వారానికి లోపలి వైపు నుంచి తాళం వేసి, సీసీటీవీలను ఆపేసినట్లు చెప్పారు. ఆస్పత్రి మద్యం బాటిల్‌ను, బ్లేడ్‌ను, రక్తపుమరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తెఘ్రా నివాసి కాగా, ఇద్దరు సహచరులు సమస్తిపుర్‌కు చెందిన వారని తెలిపారు. ప్రస్తుతం వైద్యుడు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. నర్సు చాలా ధైర్యంగా వ్యవహరించి దాడి నుంచి తప్పించుకుందని డీఎస్పీ ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.