ETV Bharat / bharat

నేషనల్​ హైవేలపై 20 కి.మీ ఫ్రీ ట్రావెల్​- కానీ వాహనంలో అది ఉంటేనే! - Free Travel On Highways

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 3:51 PM IST

Updated : Sep 10, 2024, 4:45 PM IST

Free Travel On Highways : ప్రైవేటు వాహనాల ఓనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది! ఇకపై నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది.

Free Travel On Highways
Free Travel On Highways (ETV Bharat, GettyImages)

Free Travel On Highways : ప్రైవేటు వాహనాల యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది! గ్లోబల్​ నావిగేషన్​ శాటిలైట్​ సిస్టమ్​(GNSS) వ్యవస్థ కలిగిన ప్రైవేటు వాహనాలు ఇకపై జాతీయ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్​ఛార్జీ లేకుండా ఉచితంగా తిరగొచ్చని ప్రకటించింది. దాంతోపాటు వంతెనలు, బైపాస్​ లేదా సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని పేర్కొంది. ఈ మేరకు జాతీయ రహదారుల రుసుము నియమాలు, 2008 నింబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రస్తుతం ఉన్న టోల్​గేట్ వ్యవస్థ స్థానంలో శాటిలైట్ ఆధారిత టోల్​ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొత్త విధానంలో టోల్​గేట్​ దగ్గర ఆగి, ఫీజు చెల్లించాల్సిన పని లేదు. మనం ప్రయాణించిన దూరాన్ని జీపీఎస్​ ఆధారంగా లెక్కించి, టోల్​ వసూలు చేస్తారు. ఇందుకోసం GNSS వ్యవస్థను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ వ్యవస్థ కలిగి ఉన్న వాహనాల విషయంలో కేంద్రం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఫాస్టాగ్‌, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్ రికగ్నిషన్‌ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం అమలు కానుంది. కాగా, GNSS ద్వారా టోల్ వసూలు చేయడానికి సంబంధించిన పైలట్​ స్టడీని, కర్ణాటకలో బెంగళూరు-మైసూరు జాతీయ రహదరి ఎన్​హెచ్​-275పై చేసినట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇంతకుముందు వెల్లడించారు.

ఎలా పనిచేస్తుందంటే?
GNSS ద్వారా టోల్ వసూలు చేయడానికి శాటిలైట్​ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తారు. ఈ సాంకేతిక వ్యవస్థ వాహనం కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అనంతరం GNSS వ్యవస్థతో కూడిన ఆన్‌ బోర్డు యూనిట్‌లో ఉన్న సెంట్రల్​ ప్రాసెసింగ్ యూనిట్​, అటోమెటిక్​గా టోల్​ ఛార్జీని లెక్కిస్తుంది. ఆ తర్వాత ఫాస్టాగ్​/డిజిటల్​ వ్యాలెట్​ వంటి డ్రైవర్​ ప్రీపెయిడ్​ అకౌంట్ల నుంచి ఆ టోల్​ ఛార్జీ ఆటోమెటిక్​గా కట్​ అవుతుంది. ఈ సాంకేతికత టోల్​ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని ద్వారా ట్రాఫిక్ పరిస్థితులు లేదా వివిధ రహదారులను బట్టి టోల్​ ఛార్జీలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ పద్ధతి పూర్తిగా అమలైతే మాన్యువల్ టోల్ సేకరణ అవసరం ఉండదు. దానివల్ల జరిగే ఆలస్యాన్ని అధిగమించవచ్చు. ఈ పద్ధతిలో టోల్​ కలెక్ట్ చేయడం ద్వారా చేకూరే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

'ఫాస్టాగ్'లో లొసుగులు- మోసగాళ్లకు కాసులు

'ఏడాదిలోగా దేశంలోని టోల్​ ప్లాజాలకు స్వస్తి'

Last Updated : Sep 10, 2024, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.