Farmers Government Talks : రైతు సంఘాలతో కేంద్రం జరిపిన మూడో విడత చర్చలు గురువారం అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. డిమాండ్లపై ఏకాభిప్రాయం సాధించడానికి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. రైతు సంఘాలతో చర్చలు సానుకూలంగానే సాగాయని చెప్పారు. ఈనెల 18న(ఆదివారం) సాయంత్రం ఆరు గంటలకు నాలుగో విడత చర్చలు ఉంటాయని వెల్లడించారు.
కాగా, రైతు సంఘాలతో చర్చల్లో కేంద్రం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ హాజరయ్యారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా కేంద్రం రైతు సంఘాలతో జరిపిన చర్చల్లో పాల్గొన్నారు. గురువారం రాత్రి 8గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన చర్చలు దాదాపు 5గంటల పాటు కొనసాగాయి. ఇరు పక్షాలు ఒక్కో అంశంపై సవివరంగా చర్చించుకున్నాయని భగవంత్ మాన్ తెలిపారు. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.
సంగ్రూర్, పాటియాలా, ఫతేఘడ్ సాహిబ్‌లో ఇంటర్నెట్పై ఆంక్షల ఆంశాన్ని కేంద్రం ముందు లేవనెత్తినట్లు భగవంత్ మాన్ చెప్పారు. పంజాబ్‌లోని ఆందోళనకారులపై హరియాణా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగించి బాష్పవాయువు గోళాలు ప్రయోగించడాన్ని కూడా తాను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హరియాణా- పంజాబ్ సరిహద్దుల్లో శాంతి భద్రతలను కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు.
కనీస మద్దతు ధర, రుణమాఫీకి చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లపై కేంద్రంతో వివరణాత్మక చర్చ జరిగిందని కిసాన్ మజ్దూర్ మోర్చా(ఎస్కేఎం) ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఈ క్రమంలో కేంద్రమంత్రులు అందుకు కొంత సమయం కావాలని కోరారని చెప్పారు. ప్రభుత్వంతో ఘర్షణ కాకుండా సానుకూల ఫలితం రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
-
VIDEO | "The discussion with the Centre was held on all the demands raised by us. We discussed with the aim of finding a resolution to the issues. The ministers said that they require time. We hope that a peaceful solution is derived; avoid any conflict. Our programme to go to… pic.twitter.com/ihhz3xsA9Z
— Press Trust of India (@PTI_News) February 15, 2024
Delhi Chalo Farmers Protest : మరోవైపు, దిల్లీ చలో ఆందోళనకు మద్దతుగా శుక్రవారం గ్రామీణ భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. దీనికి పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో నోయిడాలో 144 సెక్షన్ విధించారు.
రైలు రోకోకు రైతులు పిలుపు- 4 గంటలపాటు ట్రైన్లు బంద్, చర్చలు ఫలించేనా?
'ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం'- సుప్రీంకోర్టు సంచలన తీర్పు