Crispy and Tasty Egg Bread Bajji Recipe: చాలా మంది పిల్లలు పెద్దగా తినరు. వారికి ఏదో ఒకటి తినిపించాలని తల్లులు ఎంతగానే ప్రయత్నిస్తుంటారు. కానీ.. వారి ప్రయత్నం వృథా అవుతూ ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తున్నారా? అయితే ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చిటికెలో పూర్తయ్యే ఎగ్ బ్రెడ్ బజ్జీ ప్రిపేర్ చేయండి. పిల్లలు ఇంకా కావాలని లాగించకపోతే అడగండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
ఎగ్ బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు :
- శనగపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
- నీరు - సరిపడా
- వంట సోడా - చిటికెడు
- నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
- బ్రెడ్ స్లైస్‌లు - 8
- ఉడకబెట్టిన కోడిగుడ్లు - 4
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు
- పచ్చిమిర్చి - 2
- తురిమిన క్యాప్సికం ముక్కలు - పావుకప్పు
- ధనియాల పొడి- అర టీ స్పూన్
- కారం - అర టీ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
- గరం మసాలా - పావు టీ స్పూన్
- టమాట సాస్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఎగ్ బ్రెడ్ బజ్జీ తయారీ విధానం:
- ముందుగా స్టఫింగ్ కోసం ప్రిపరేషన్ చేసుకోవాలి. అందుకోసం స్టౌ మీద పాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూడు నిమిషాలు వేయించుకోవాలి.
- ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి వేయించుకోవాలి.
- మసాలాలు మాడిపోకుండా నాలుగు టేబుల్ స్పూన్ల నీరు పోసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత తరిగిన కొత్తిమీర తరుగు, టమాట సాస్ వేసుకుని బాగా కలిపి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మిల్క్ బ్రెడ్ లేదా శాండ్విచ్ బ్రెడ్ స్లైస్‌లు తీసుకుని నాలుగు వైపులా వాటి సైడ్స్ కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ బ్రెడ్ స్లైస్ తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని బ్రెడ్ మధ్యలో పెట్టి కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆ ఉల్లిపాయ మిశ్రమం మీద సగం కట్ చేసిన కోడిగుడ్డును పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రైడ్ స్లైస్ అంచులను నీటితో కొద్దిగా తడపాలి.
- అదే విధంగా మరో బ్రెడ్ స్లైస్ తీసుకుని మధ్యలోకి ఆనియన్ మిశ్రమం పెట్టుకుని.. దాని అంచులను కూడా కొద్దిగా తడుపుకోవాలి.
- ఇప్పుడు అంచులు తడుపుకున్న బ్రెడ్ స్లైస్‌ను ఎగ్ మిశ్రమం పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ మీద పెట్టి.. రెండు బ్రెడ్ స్లైస్ అంచులను అదిమితే తడి ఉండటం వల్ల అవి రెండూ అంటుకుంటాయి. ఇలా మిగిలిన బ్రెడ్ స్లైస్లన్నింటిని చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని అందులోకి జల్లించిన శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, సోడా ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు అందులోకి సన్నని కొత్తిమీర తరుగు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బజ్జీలు వేసుకునేందుకు సరిపడే విధంగా బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. శనగపిండిని ఎంత ఎక్కువ సేపు కలుపుకుంటే ఎగ్ బ్రెడ్ బజ్జీలు అంత బాగా వస్తాయి. లేదంటే తినేటప్పుడు పిండి నోటికి అంటకపోతుంది.
- ఇప్పుడు స్టౌమీద బాండీ పెట్టి నూనె వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్‌ను శనగపిండిలో రెండు వైపులా బాగా డిప్ చేయాలి.
- ఇప్పుడు కాగుతున్న నూనెలో వేసి ఒక నిమిషం పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత రెండో వైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలను వేయించుకోవాలి.
- ఇప్పుడు నూనెలో నుంచి తీసిన బ్రెడ్‌ను సగానికి కట్ చేసుని సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే అద్దిరిపోతుంది.
క్రిస్పీ పొటాటో లాలీపాప్స్- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!
స్వీట్ షాపు స్టైల్ కరకరలాడే చెగోడీలు - ఇలా చేస్తే రెండు తినే దగ్గర నాలుగు లాగించడం పక్కా!
'ఆలూ మాసాలా సాండ్విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్ టూ యమ్మీ' అనడం పక్కా!