Doctors Strike Called Off Today : కోల్‌కతా ఆర్జే కర్ ఆస్పత్రిలో డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు ఎట్టకేలకు తమ సమ్మెను విరమించారు. విధుల్లోకి చేరాలని కోరడం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని సుప్రీంకోర్టు హామీలు ఇచ్చిన క్రమంలో తమ సమ్మెను విరమిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఆగస్టు 23వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సేవలను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
"మా డిమాండ్లతోపాటు ఆందోళనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. మా విధులన్నింటినీ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం" అంటూ రిసిడెంట్ డాక్టర్ అసోసియేషన్, డా.ఆర్ఎంఎల్ హాస్పిటల్ ప్రకటనను విడుదల చేసింది. 11 రోజులుగా సమ్మె నిర్వహించామని, కోర్టులు జోక్యం చేసుకోవడం ఉపశమనం కలిగించిందని RDA ఎయిమ్స్ దిల్లీ జనరల్ సెక్రటరీ డాక్టర్ రఘునందన్ దీక్షిత్ తెలిపారు.
In view of the developments with respect to our demands, and our concerns being addressed by the Supreme Court, we hereby declare the strike to be withheld. We hereby have decided to resume all our duties. Recent mishappening at RG Kar Medical College highlighted the sorry state… pic.twitter.com/vwGL9UlXQX
— ANI (@ANI) August 22, 2024
"మా మొదటి డిమాండ్‌ను కలకత్తా హైకోర్టు పరిష్కరించింది. కేసును CBIకి బదిలీ చేసింది. హత్యాచార ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని సమగ్రంగా విచారణ జరిపింది. జరుపుతోంది కూడా. అందుకే AIIMS జనరల్ బాడీ సమ్మె విరమించాలని నిర్ణయించింది. కానీ న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటోంది. మా వైద్యులందరూ గురువారం సాయంత్రమే తిరిగి విధుల్లో చేరుతారు" అని రఘనందన్ దీక్షిత్ తెలిపారు.
#WATCH | RDA AIIMS Delhi calls off their 11-day strike.
— ANI (@ANI) August 22, 2024
Dr Raghunandan Dixit, RDA AIIMS Delhi General Secretary says, " we were on a strike for the past 11 days. after that, court intervened twice. it did provide us with some relief. high court fulfilled our first demand and… pic.twitter.com/HNeX9rRPov
'వైద్యులు పనిచేయకపోతే ఎలా?'
అంతకుముందు హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు గురువారం ఉదయం విచారణ చేపట్టింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించింది. మొదట ఆందోళన చేస్తున్న డాక్టర్లను విధుల్లో చేరమని సూచించింది. ఆ తర్వాత వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని స్పష్టం చేసింది. సమ్మె వల్ల రోగులు పడే ఇబ్బందులు గురించి ఆలోచించాలని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
కేసులు రద్దు చేయాలంటే!
డాక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు చేయాలంటే ముందు విధుల్లో చేరాలని సూచించింది. వైద్యులు విధుల్లో చేరాకే అన్ని విషయాలను పరిశీలిస్తామని తెలిపింది. వైద్యులకు భద్రతపై రాష్ట్రాలు రెండు వారాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. హత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దని, చట్టం తన పని చేసుకుపోతుందని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వైద్యులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
'సీన్ మొత్తం మార్చేశారు'
మరోవైపు, హత్యాచారం జరిగిన కేసు తమ చేతికి వచ్చేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఫలితంగా దర్యాప్తు సవాల్‌గా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా కోల్‌కతా పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదుకు 14 గంటల ఆలస్యం ఎందుకయ్యిందని బంగాల్ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.