Doctor Shot Dead Inside Hospital In Delhi : దిల్లీలో దారుణం జరిగింది. ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు డాక్టర్‌ను కాల్చి చంపారు. కలింది కుంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జైత్‌పుర్‌లో ఉన్న నీమ ఆస్పత్రిలో బుధవారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని యూనాని ప్రాక్టీషనర్ జావెద్ అక్తర్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయాలతో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రికి వచ్చారు. గాయాలకు డ్రెస్సింగ్ చేసిన తర్వాత డాక్టర్‌ను కలవాలని పట్టుబట్టారు. దీంతో ఆస్పత్రి స్టాఫ్, నిందితులకు డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. వెంటనే వైద్యుడి క్యాబిన్లోకి వెళ్లిన దుండుగులు, అతడిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారని హాస్పటల్ స్టాఫ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు ఆస్పత్రి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డైనట్లు చెప్పారు.
దీనిపై సమచారం అందుకున్న వెంటనే జిల్లా క్రైమ్, ఫోరెన్సిక్ టీమ్‌లు ఘటనస్థలికి చేరుకున్నాయి. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. నిందితులు మైనర్లు అని, పక్కా ప్లాన్‌తోనే డాక్టర్‌ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
'ఎల్జీ కారణంగానే దిల్లీలో నేరాలు పెరిగాయ్'
ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సౌరభ భరద్వాజ్ స్పందిచారు. కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ఎల్జీ వీకే సక్సేనా విఫలమయ్యారని, దేశ రాజధానిలో నేరాలు పెరగడానికి వారే బాధ్యులని ఆరోపించారు.