ETV Bharat / bharat

ఈ 'చిమ్​టు' హార్ట్​ చాలా పెద్దది తమ్ముడు! 'లాబ్రడార్' కోసం 'డాబర్‌‌మన్' రక్తదానం - Doberman Blood Donation

Doberman Blood Donation : రక్తదానం చేసే గొప్ప అవకాశం ఆ కుక్కకు కూడా లభించింది. కర్ణాటకలోని కొప్పల్‌ పట్టణంలో ఓ డాబర్‌మన్ జాతి కుక్క రక్తంతో మరో కుక్కకు చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. స్థానిక వెటర్నరీ డాక్టర్ చొరవతో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్న లాబ్రడార్ జాతి కుక్కకు సకాలంలో మరో కుక్క రక్తం అందింది.

Doberman Blood Donated to Labrador
Doberman Blood Donated to Labrador (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 5:29 PM IST

Doberman Blood Donation : అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని అంటారు. ఒక మనిషి ప్రాణాలను నిలపడానికి మరో మనిషి రక్తదానం చేస్తుండటం గురించి మనకు తెలుసు. కానీ కర్ణాటకలోని కొప్పల్​లో ఇందుకు భిన్నమైన ఓ ఘటన ఇటీవల జరిగింది. ఓ కుక్క ప్రాణాలను కాపాడేందుకు మరో శునకం రక్తదానం చేసింది.

ఆ కుక్కకు హెమోగ్లోబిన్ లోపం
కొప్పల్​లో ఓ వ్యక్తి లాబ్రడార్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఆ శునకం హెమోగ్లోబిన్ లోపంతో బాధపడుతోంది. దీని కారణంగా దాని ఆరోగ్యం చాలా దెబ్బతింది. ఈ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్‌కు లాబ్రడార్ జాతి కుక్కను చూపించగా, సేమ్ బ్లడ్ గ్రూప్ కలిగిన మరో కుక్క రక్తాన్ని ఎక్కిస్తేనే దాని ప్రాణాలను నిలుపగలుగుతామని తేల్చి చెప్పారు.

దీంతో కొప్పల్​లోనే డాబర్‌మన్ జాతి కుక్కలను పెంచుకుంటున్న మరో ముగ్గురు వ్యక్తులను డాక్టర్ సంప్రదించారు. లాబ్రడార్ జాతి కుక్క ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యను వివరించి, శాంపిల్ మ్యాచ్ అయితే వారి కుక్కలతో రక్తదానం చేయించాలని కోరారు. ఇందుకు డాబర్‌మన్ జాతి కుక్కల యజమానులు ఒప్పుకున్నారు.

ఈ క్రమంలో ఆ మూడు డాబర్‌మన్ జాతి కుక్కల నుంచి బ్లడ్ శాంపిల్స్‌ను సేకరించారు. ప్రొఫెసర్ బసవరాజ్‌ పూజర్‌కు చెందిన డాబర్‌మన్ జాతి కుక్క 'భైరవ' (మూడేళ్ల వయసు) బ్లడ్ శాంపిల్‌తో లాబ్రడార్ జాతి కుక్క బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అయింది.

'భైరవ' రక్తదానం
బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వడం వల్ల వెటర్నరీ మెడికల్ రూల్స్ ప్రకారం 'భైరవ' మెడ నుంచి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని డాక్టర్ సేకరించారు. ఆ వెంటనే 12 నిమిషాల్లోగా దాన్ని లాబ్రడార్ జాతి కుక్కకు ఎక్కించారు. ఇప్పుడు అది ఆరోగ్య సమస్య నుంచి క్రమంగా కోలుకుంటోంది.

"మేం మా కుక్క (భైరవ)ను వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుండే వాళ్లం. అందుకే మా ఫోన్ నెంబర్ ఆ డాక్టర్ దగ్గర ఉంది. ఆయన కాల్ చేసి మా కుక్కతో రక్తదానం చేయించమన్నారు. మేము కూడా ఒప్పుకున్నాం. మా కుక్క రక్తం మరో కుక్క ప్రాణాలు నిలుపుతుందని చెప్పగానే అంగీకరించాం. ఈ రకంగా సాయపడినందుకు మాకెంతో గర్వంగా ఉంది" అని రక్తదానం చేసిన డాబర్‌మన్ జాతి కుక్క యజమాని బసవరాజ్ పుజారా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.