You Can Travel in Sleeper Class with a General Ticket : డబ్బు ఆదా మొదలు పలు కారణాలతో.. రైలు ప్రయాణానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా.. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ట్రైన్(Train) రవాణాకు మొగ్గు చూపుతుంటారు. అయితే.. జనాల ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా ట్రైన్లో జనరల్, స్లీపర్, ఏసీ కేటగిరీల్లో సీట్లు ఉంటాయని తెలిసిందే.
చాలా మంది జనరల్ టికెట్ తీసుకుని జర్నీ చేస్తుంటారు. కానీ.. కొన్ని అత్యవసర పరిస్థితుల్లోనో, జనరల్ బోగీల్లో ప్లేస్ లేకనో కొందరు జనరల్ టికెట్ తీసుకొని.. స్లీపర్ క్లాస్ బోగీలో ప్రయాణిస్తుంటారు. ఆ టైమ్‌లో చెకింగ్‌కి వచ్చిన టీటీఈ ఫైన్ వేస్తారు. అయితే.. చాలా మందికి తెలియని విషయమేమిటంటే కొన్ని రూల్స్ ఫాలో అవుతూ ఫైన్ తప్పించుకోవచ్చు. అంతేకాదు.. జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే చట్టాల్లోని కొన్ని నిబంధనలు తెలుసుకుంటే.. మీరు జనరల్ టికెట్ తీసుకొని అనుకోకుండా స్లీపర్ క్లాస్ బోగీ ఎక్కినా ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. రైల్వే రూల్స్ 1989 ప్రకారం.. మీ ప్రయాణ దూరం 199 కిలో మీటర్ల లోపు ఉంటే.. మీరు తీసుకున్న జనరల్ టికెట్ చెల్లుబాటు సమయం 3 గంటలు. ఇప్పుడు మీరు జనరల్ టికెట్ తీసుకొని మీ ట్రైన్ కోసం వేచి ఉన్నారనుకోండి. గంటలు గడుస్తున్నా మీ ట్రైన్ రాకపోతే.. అప్పుడు మీరు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించవచ్చట.
ట్రైన్ జర్నీలో ఇబ్బందులా? ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఒక్క కాల్ చేస్తే వెంటనే పరిష్కారం!
మీరు ఇలా జనరల్ టికెట్‌తో స్లీపర్‌లో ప్రయాణించాల్సి వస్తే రైల్వే చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం.. మీరు స్లీపర్ కోచ్‌కి వెళ్లిన తర్వాత ముందుగా టీటీఈని కలవాలి. టీటీఈని కలిసి స్లీపర్‌లో ప్రయాణించడానికి గల కారణాలు, మీ జర్నీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి. అప్పుడు టీటీఈ.. స్లీపర్ క్లాస్‌లో ఏదైనా సీటు ఖాళీగా ఉంటే.. మీ జనరల్ టికెట్ ఖర్చు మైనస్ చేసి స్లీపర్ క్లాస్ టికెట్ డబ్బును మీ నుంచి తీసుకుంటాడు. ఈ మేరకు ఒక రసీదుని మీకు ఇస్తారు. అలా.. మీరు ఆ సీటులో ప్రయాణించవచ్చు.
ఒకవేళ మీరు ఎక్కిన స్లీపర్ క్లాస్ బోగీలో సీట్లు ఖాళీగా లేకపోతే.. తర్వాతి స్టేషన్ వరకు ఉచితంగా ప్రయాణించేందుకు మీకు అనుమతి ఇస్తారు. నెక్స్ట్ స్టేషన్లో దిగి ఆ ట్రైన్‌లోని జనరల్ బోగీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాకాకుండా.. మీరు జనరల్ బోగీలో జర్నీ చేయలేం అనుకుంటే మాత్రం.. టీటీఈ చెప్పిన ధర చెల్లించి స్లీపర్ క్లాస్‌లోనే సీటు లేకుండా జర్నీ చేయాల్సి ఉంటుంది.
ట్రైన్ టికెట్ పోయిందా/ చిరిగిపోయిందా? సింపుల్‌గా డూప్లికేట్ టికెట్ పొందండిలా!